Kajal Marriage : వైరల్ అవుతోన్న కాజల్ తీన్మార్ డ్యాన్స్
అందాల చందమామ కాజల్ పెళ్లి చేసుకుంటుంది. ఇది ఆమెను కలల రాణిగా భావిస్తోన్న అభిమానులకు కాస్త చేదు వార్తే. దాదాపు దశాబ్ద కాలానికి పైగా సౌత్ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగి... ఎన్నో గొప్ప పాత్రల్లో నటించింది కాజల్ అగర్వాల్.

అందాల చందమామ కాజల్ పెళ్లి చేసుకుంటుంది. ఇది ఆమెను కలల రాణిగా భావిస్తోన్న అభిమానులకు కాస్త చేదు వార్తే. దాదాపు దశాబ్ద కాలానికి పైగా సౌత్ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగి… ఎన్నో గొప్ప పాత్రల్లో నటించింది కాజల్ అగర్వాల్. ఈ రోజు సాయంత్రం కాజల్ పెళ్లి జరగబోతుంది. ముంబయికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లును ఈ ముద్దుగుమ్మ మనువాడబోతుంది. గత నాలుగు రోజుల నుంచి కాజల్ ఇంట ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మెహందీ, హల్దీ , సంగీత్ వేడుకలలో కాజల్ అదరగొట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం కాజల్ కి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. కాగా ఈ కార్యక్రమాల్లో భాగంగా కాజల్ తీన్మార్ బ్యాండ్ శబ్దాలకు అనువుగా స్టెప్పులు వేసింది . ఇక ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. చందమామ ఇంత సంతోషంగా ఉండటం చూసి సంబరపడిపోతున్నారు ఆమె ఫ్యాన్స్.
Also Read :