ఇండియాలో పబ్జీ ఖతం..నేటి నుంచి వారికి కూడా నో ఛాన్స్

పబ్జీ మళ్లీ వస్తుందని ఎదురుచూస్తున్న వారి ఆశలు..ఇకపై అడియాశలే.  ఈ ఆటను ఆడేందుకు ఇకపై అస్సలు వీలుండదు. శుక్రవారం నుంచి పబ్జీ భారత సర్వర్లను నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ అనౌన్స్ చేసింది.

ఇండియాలో పబ్జీ ఖతం..నేటి నుంచి వారికి కూడా నో ఛాన్స్
Follow us

|

Updated on: Oct 30, 2020 | 2:49 PM

పబ్జీ మళ్లీ వస్తుందని ఎదురుచూస్తున్న వారి ఆశలు..ఇకపై అడియాశలే.  ఈ ఆటను ఆడేందుకు ఇకపై అస్సలు వీలుండదు. శుక్రవారం నుంచి పబ్జీ భారత సర్వర్లను నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ అనౌన్స్ చేసింది. దీంతో ప్రస్తుతమున్న పబ్జీ యూజర్లకు ఇక నుంచి ఆడే ఛాన్స్ ఉండదు. భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన దాదాపు రెండు నెలల తర్వాత పబ్జీ తన సేవలను పూర్తిగా నిలిపివేసింది.

పబ్జీ సహా 116 మొబైల్‌ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో సెప్టెంబరు 2 నుంచి పబ్జీ కొత్త డౌన్‌లోడ్లు ఆగిపోయాయి. అయితే  బ్యాన్ చెయ్యడానికి ముందే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నవారికి మాత్రం ఇప్పటివరకు ఆట‌ ఆడే అవకాశం లభించింది. తాజాగా సర్వర్లను కూడా నిలిపివేయడంతో ఇకపై వారికి కూడా యాప్‌ పనిచేయదు. ఈ విషయాన్ని పబ్జీ మొబైల్‌ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపింది. ‘ఐటీ, ఎలక్ట్రానిక్‌ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు అక్టోబరు 30 నుంచి ఇండియన్ యూజర్లకు పబ్జీ మొబైల్‌ నోర్డిక్‌ మ్యాప్‌: లివిక్‌, పబ్జీ మొబైల్‌ లైట్‌ సర్వీసులను టెన్సెంట్‌ గేమ్స్‌ నిలిపివేసింది. యూజర్ల డేటా సేఫ్టీకి మేం అధిక ప్రాధాన్యమిస్తాం. భారత డేటా భద్రత చట్టాలను, నిబంధనలను ఎల్లప్పుడూ పాటించాం’ అని పబ్జీ మొబైల్‌ పేర్కొంది.

Also Read : జగ్గయ్యపేటలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యం