AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఎన్ఎస్ కోరా యాంటీ షిప్ మిస్సైల్‌ను విజయవంతం

భార‌తీయ నౌకాద‌ళం క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌తో దూసుకుపోతుంది. ఇటీవ‌లే ఐఎన్ఎస్ ప్ర‌భ‌ల్ ప్రయోగించిన నేవీ.. తాజాగా ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌక నుంచి యాంటీ షిప్ మిస్సైల్‌ను విజయవంతంగా ప‌రీక్షించింది.

ఐఎన్ఎస్ కోరా యాంటీ షిప్ మిస్సైల్‌ను విజయవంతం
Balaraju Goud
|

Updated on: Oct 30, 2020 | 2:15 PM

Share

భార‌తీయ నౌకాద‌ళం క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌తో దూసుకుపోతుంది. ఇటీవ‌లే ఐఎన్ఎస్ ప్ర‌భ‌ల్ ప్రయోగించిన నేవీ.. తాజాగా ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌక నుంచి యాంటీ షిప్ మిస్సైల్‌ను విజయవంతంగా ప‌రీక్షించింది. గ‌రిష్ట దూరంలో ఉన్న టార్గెట్‌ను అత్యంత క‌చ్చిత‌త్వంతో పేల్చేశారు. బంగాళాఖాతంలో శుక్రవారం నిర్వహించిన ఈ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలిగామని ఇండియన్ నేవీ అధికారులు ప్రకటించారు. టార్గెట్ షిప్ తీవ్రంగా ధ్వంస‌మైంద‌ని, ఆ నౌక నుంచి మంట‌లు వ్యాపించిన‌ట్లు నౌకాద‌ళ ప్ర‌తినిధి త‌న ట్వీట్‌లో తెలిపారు. ఐఎన్ఎస్ కోరాను 1998లో క‌మిష‌న్ చేశారు. ప్రాజెక్టు 24ఏ కింద ఈ యుద్ధ‌నౌక‌ను డిజైన్ చేశారు. కేహెచ్‌-35 యాంటీ మిస్సైళ్లను ఇది ప్ర‌యోగించ‌గ‌ల‌దు. ఐఎన్ఎస్ కోరాతో పాటు ఐఎన్ఎస్ కిర్చి, ఐఎన్ఎస్ కులిష్‌, ఐఎన్ఎస్ కార్ముక్ యుద్ధ నౌక‌లు భార‌త్ అమ్ముల పొదలో పొదిగి ఉన్నాయి. ఇటీవ‌లే ఐఎన్ఎస్ ప్ర‌భ‌ల్ కూడా అరేబియా స‌ముద్రంలో మిస్సైల్ ప‌రీక్ష చేప‌ట్టింది. వరుస ప్రయోగాలతో శత్రు దేశాల్లో వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

Follow Us