కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,531 కొత్త కేసులు.. 6 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,531 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,531 కొత్త కేసులు.. 6 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Oct 30, 2020 | 8:51 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,531 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,37,187 కు చేరింది. 24 గంటల్లో ఆరుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,330కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,048 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,17,401 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 18,456 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 43,790 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 42,40,748 కు చేరింది.( ఈ క్రెడిట్‌ మొత్తం నీదే: మంచు లక్ష్మికి సూర్య థ్యాంక్స్‌)

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 293, ఆదిలాబాద్ 17, భద్రాద్రి కొత్తగూడెం 96, జగిత్యాల్‌ 61, జనగాం 17, జయశంకర్ భూపాలపల్లి 17, జోగులమ్మ గద్వాల్‌ 6, కామారెడ్డి 39, కరీంనగర్‌ 71, ఖమ్మం 83, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 9, మహబూబ్‌ నగర్‌ 26, మహబూబాబాద్‌ 31, మంచిర్యాల్‌ 36, మెదక్‌ 22, మేడ్చల్ మల్కాజ్‌గిరి 120, ములుగు 18, నాగర్‌ కర్నూల్‌ 32, నల్గొండ 74, నారాయణ్‌పేట్‌ 3, నిర్మల్‌ 17, నిజామాబాద్‌ 35, పెద్దంపల్లి 2, రాజన్న సిరిసిల్ల 27, రంగారెడ్డి 114, సంగారెడ్డి 28, సిద్ధిపేట్‌ 47, సూర్యాపేట 26, వికారాబాద్‌ 10, వనపర్తి  22, వరంగల్‌ రూరల్‌ 25, వరంగల్‌ అర్బన్‌ 54, యాద్రాది భువనగిరి 31 కేసులు నమోదయ్యాయి.(Bigg Boss 4: మోనాల్‌పై అభిజిత్‌ బాడీ షేమింగ్ కామెంట్లు)