Srisailam: శ్రీశైలంలో కనుల పండువగా ప్రారంభమైన భ్రమరాంబ దేవికి వార్షిక కుంభోత్సవం

నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చిన శుక్రవారం సందర్భంగా భ్రమరాంబికాదేవికి ఆలయంలో నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజ, జపపారాయణలను నిర్వహించారు.

Srisailam: శ్రీశైలంలో కనుల పండువగా ప్రారంభమైన భ్రమరాంబ దేవికి వార్షిక కుంభోత్సవం
Kumbhotsavam Of Goddess Bhramaramba
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 26, 2024 | 10:56 AM

నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చిన శుక్రవారం సందర్భంగా భ్రమరాంబికాదేవికి ఆలయంలో నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజ, జపపారాయణలను నిర్వహించారు. అచారాన్ని అనుసరించి ఈ పూజలన్ని అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. తరువాత అమ్మవారి ఆలయ ముందుభాగంలో రజకునిచేత ముగ్గు వేయించి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి మొదటి విడత సాత్వికబలి ఇచ్చారు

ఈ సందర్బంగా అమ్మవారికి వందల సంఖ్యలో గుమ్మడి కాయలు, కొబ్బరికాయలను, నిమ్మకాయల సాత్విక బలిగా ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు భక్తులు సమర్పించారు. అయితే సాయంకాలం మల్లికార్జునస్వామికి మహా మంగళ హారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామిపై పడకుండా లింగరూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర, శోంఠి భక్షాలతో కప్పివేశారు. అలాగే అమ్మవారికి ఆలయ ప్రకారం బయట ముఖమండపం ముందు అన్నం రాసిగా పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఘట్టం స్త్రీ వేషధారణలో స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి సమర్పణ ప్రధానఘట్టం కుంభ హారతి అనంతరం మళ్ళీ రెండోవ విడత సాత్విక బలిగా కొబ్బరి, గుమ్మడికాయలు సమర్పించిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

మరిన్ని ఆధ్మాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు