AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు సినిమాకు ముందుగా అనుకున్నది అతడినే.. చివరకు నరేష్‍కు..

అల్లరి నరేష్ హీరోగా.. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మల్లి అంకం డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని కలిగించిన ఈ మూవీ మే 3న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఒక్కటీ అడక్కు సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రొడ్యూసర్ రాజేష్.

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు సినిమాకు ముందుగా అనుకున్నది అతడినే.. చివరకు నరేష్‍కు..
Aa Okkati Adakku Movie
Rajitha Chanti
|

Updated on: Apr 26, 2024 | 1:11 PM

Share

ఒకప్పుడు కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు హీరో అల్లరి నరేష్. ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఈ హీరో.. వైవిధ్యమైన సినిమాలతో మెప్పించాడు. నాంది, ఉగ్రం అంటూ సీరియస్ కంటెంట్ చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్లీ కామెడీ నేపథ్యం మూవీతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. అదే ఆ ఒక్కటీ అడక్కు. అల్లరి నరేష్ హీరోగా.. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మల్లి అంకం డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని కలిగించిన ఈ మూవీ మే 3న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఒక్కటీ అడక్కు సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రొడ్యూసర్ రాజేష్.

రాజేష్ చిలకా మాట్లాడుతూ.. “ఈ సినిమా కథను డైరెక్టర్ మల్లి అంకం చెప్పగానే నా మైండ్ లోకి వచ్చిన మొదటి హీరో రాజేంద్రప్రసాద్ గారు. ఆయన యంగ్ గా ఉంటే ఈ సినిమాకు ఆయన పర్ఫెక్ట్. ఇక ఇప్పుడున్న హీరోలలో అయితే అల్లరి నరేష్ గారికే ఈ మూవీ సెట్ అవుతుంది. అలాగే ఈ సినిమాకు టైటిల్ గురించి ఆలోచిస్తున్న సమయంలో అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు టైటిల్ సూచించారు. ఆయనను పెళ్లి ఎప్పుడని అడిగినప్పుడల్లా ఇదే ఆన్సర్ ఇచ్చేవారని” అన్నారు.

సినిమా విషయానికి వస్తే సబ్ రిజిస్టార్ గా తన చేతులపై ఎన్నో పెళ్లిళ్లు జరిపించిన అతడికి 35 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. మరి తన వివాహం కోసం ఆ హీరో చేసిన ప్రయత్నాలేంటీ ? ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయనేది వినోదాత్మకంగా చూపించామని అన్నారు రాజేష్ చిలకా. ఈ సినిమా ఈతరం యువతకు బాగా కనెక్ట్ అయ్యే కథ అని ప్రేక్షకులను కట్టిపడేస్తుందని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.