ఫేక్ డాక్యుమెంట్ల కేసు.. కోర్టుకు వైసీపీ ఎమ్మెల్యే
నకిలీ డాక్యుమెంట్లు, పరువు నష్టం కేసుల్లో నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. అయితే వివిధ పత్రాలను చూపించి అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హవాలకు పాల్పడ్డారంటూ కాకాణి గతేడాది పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమిరెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి తనపై బురదజల్లుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ప్రాధమికంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అవి నకిలీ […]
నకిలీ డాక్యుమెంట్లు, పరువు నష్టం కేసుల్లో నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. అయితే వివిధ పత్రాలను చూపించి అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హవాలకు పాల్పడ్డారంటూ కాకాణి గతేడాది పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమిరెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి తనపై బురదజల్లుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ప్రాధమికంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అవి నకిలీ పత్రాలని తేల్చి.. కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన చిరంజీవి అలియాస్ మణిమోహన్‌పై కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఆ నకిలీ డాక్యుమెంట్లన్నీ చిరంజీవిని రూపొందించారని నిర్ధారించుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ సోమిరెడ్డి, కాకాణిపై పరువు నష్టం దావా వేశారు. ఆ కేసుల విచారణలో భాగంగా సోమవారం కాకాణి నెల్లూరులోని 4వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు.