టాలీవుడ్‌పై కేసీఆర్ నజర్.. దూతగా మళ్ళీ తలసాని

తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిని సీరియస్‌గా టేకప్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండస్ట్రీలోని కీలక వ్యక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రక్రయను వేగవంతం చేశారు. గత వారం మెగాస్టార్ చిరంజీవి, నటసామ్రాట్ నాగార్జునలతో భేటీ అయిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మరోసారి ప్రభుత్వ దూతగా వారి దగ్గరికి పంపారు. గత వారం చర్చించిన అంశాలపై ఫీడ్‌బ్యాక్‌తో మరోసారి వెళ్ళిన తలసాని.. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి, నాగార్జునలతో సోమవారం సాయంత్రం […]

టాలీవుడ్‌పై కేసీఆర్ నజర్.. దూతగా మళ్ళీ తలసాని
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 10, 2020 | 7:36 PM

తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిని సీరియస్‌గా టేకప్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండస్ట్రీలోని కీలక వ్యక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రక్రయను వేగవంతం చేశారు. గత వారం మెగాస్టార్ చిరంజీవి, నటసామ్రాట్ నాగార్జునలతో భేటీ అయిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మరోసారి ప్రభుత్వ దూతగా వారి దగ్గరికి పంపారు. గత వారం చర్చించిన అంశాలపై ఫీడ్‌బ్యాక్‌తో మరోసారి వెళ్ళిన తలసాని.. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి, నాగార్జునలతో సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు.

చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై తలసాని.. అగ్రహీరోలిద్దరితో చర్చలు జరుపుతున్నారు. గతవారం సింగిల్‌గా చిరంజీవి ఇంటికి వెళ్ళి మంతనాలు జరిపిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. సోమవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలిసి బృందంగా వెళ్ళి వారిని కలిశారు. అధికారులతో కలిసి చిరంజీవి, నాగార్జునలతో సమీక్షా సమావేశం కొనసాగించారు.

ప్రస్తుతం ఈ భేటీపై అటు సినీ వర్గాల్లోనూ.. రాజకీయ వర్గాల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అందజేత, థియేటర్ల కొరత, ఆన్ లైన్ టికెటింగ్, షూటింగ్ పర్మిషన్లు సహా లొకేషన్లలో మహిళల భద్రతపై వీరు చర్చించినట్లు సమాచారం.

చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై హోమ్, రెవెన్యూ, న్యాయ,కార్మిక శాఖ అధికారులతో సమావేశంలో కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాలలో స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను తలసాని ఆదేశించారు. కల్చరల్ సెంటర్, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాలు సేకరించాలని మంత్రి నిర్దేశించినట్లు తెలుస్తోంది.

సినీ, టి.వి. కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఎఫ్డీసీ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు చేపడతామని మంత్రి తలసాని సినీ రంగ ప్రముఖులకు హామీ ఇచ్చారు. పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.