AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తహసీల్దార్ కాళ్లకు మొక్కిన టీడీపీ ఎమ్మెల్యే…ఎందుకంటే..?

పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ మధ్యకాలంలో బాగా హైలెట్ అవుతున్నారు. టీడీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. అందులో కూడా కాస్త గట్టిగా మాట్లాగల్గినవారు, పార్టీ వాయిస్‌ను జనాల్లోకి తీసుకువెళ్లేవారు చాలా తక్కువమంది ఉన్నారు. కాస్త సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి కావడంతో నిమ్మల రామానాయుడు ఆ 21 మందిలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా ఆయన పెన్షన్లు, రేషన్ కార్డులో మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వారి  పక్షాన  వినూత్న రీతిలో […]

తహసీల్దార్ కాళ్లకు మొక్కిన టీడీపీ ఎమ్మెల్యే...ఎందుకంటే..?
Ram Naramaneni
|

Updated on: Feb 10, 2020 | 6:42 PM

Share

పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ మధ్యకాలంలో బాగా హైలెట్ అవుతున్నారు. టీడీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. అందులో కూడా కాస్త గట్టిగా మాట్లాగల్గినవారు, పార్టీ వాయిస్‌ను జనాల్లోకి తీసుకువెళ్లేవారు చాలా తక్కువమంది ఉన్నారు. కాస్త సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి కావడంతో నిమ్మల రామానాయుడు ఆ 21 మందిలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా ఆయన పెన్షన్లు, రేషన్ కార్డులో మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వారి  పక్షాన  వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నేడు (ఫిబ్రవరి 10) యలమంచిలి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన రామానాయుడు అర్హులైన వారందరికి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని తహసీల్దార్ సూర్యనారాయణ కాళ్లపై పడి అభ్యర్థించారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు, ప్రజలు, ఆఫీసర్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే తేరుకున్న తహసీల్దార్ పత్రాలను పరిశీలించి..సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.

ఇప్పడే కాదు గతంలో కూడా పలుసార్లు ఎమ్మెల్యే రామానాయుడు వినూత్న రీతిలో నిరసనను తెలిపారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని నిరసన ప్రదర్శన చేసిన ఆయన..రక్తంతో ప్లకార్డులపై వేలి ముద్రలు వేశారు. రక్తం చిందించి అయినా అమరావతి కాపుడుకుంటామని నినాదాలు ఇచ్చారు. కాగా పాలకొల్లు నుంచి రెండోసారి ఎమ్మల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు రామానాయుడు.

Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన