AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ తొలిసారిగా జెండా పండుగ..! దేశభక్తి గీతాలతో సందడి చేసిన గిరిజన బాలలు.. ఎక్కడంటే..

మరోవైపు జామిగూడ లోనూ జాతీయ జెండా ఆవిష్కరించారు. చింతపల్లి, జీకే వీధి పెదబయలు ముంచంగి పుట్టు మండలాల్లోనూ ఇన్నాళ్లు వేడుకలకు దూరంగా ఉన్న గిరిజనులు.. జాతీయ జెండా ఆవిష్కరించి సలాం చేశారు. మావోయిస్టులు గతంలో మారుమూల ప్రాంతాల్లో నల్ల జెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చేవారు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండడంతో గిరిజనులు అంతా సంబరాలు చేసుకున్నారు.

అక్కడ తొలిసారిగా జెండా పండుగ..! దేశభక్తి గీతాలతో సందడి చేసిన గిరిజన బాలలు.. ఎక్కడంటే..
Independence Day celebrations
Maqdood Husain Khaja
| Edited By: Jyothi Gadda|

Updated on: Aug 16, 2024 | 7:13 PM

Share

అల్లూరి ఏజెన్సీలోని మారుముల ప్రాంతాల్లోనూ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మావొయిస్టు ప్రాబల్య ప్రాంతాలు కావడంతో చాలాచోట్లా ఇన్నాళ్ళూ భయంతో బిక్కుబిక్కుమన్న ఆ గిరిజనులు… ఇప్పుడు స్వేచ్ఛగా జెండా పండుగలో పాల్గొన్నారు. మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా అంటూ ఆ గిరిజన బాలలు ముచ్చటగా దేశభక్తి గీతాలను ఆలపించారు. జై హింద్ అంటూ జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టారు. చాక్లెట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. గ్రామస్తులంతా వాళ్లకు తోడయ్యారు.

అల్లూరి జిల్లా ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించారు గిరిజనులు. ఎందుకంటే గతంలో ఆయా ప్రాంతాలని మావోయిస్టుల ఆధీనంలో ఉండేవి. గతంలో పెదబయలు, జీకే వీధి, ముంచంగిపుట్టుసహా పలు మండలాల్లోని గిరిజనుల గ్రామాలు మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాలుగా ఉండేవి. దీంతో ఆయా ప్రాంతాల్లో స్థానికులు మావోయిస్టులకు భయపడి ఉండేవారు. స్వేచ్ఛగా జాతీయ పండుగలో పాల్గొనేందుకు భయపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం పోలీసులు గిరిజనులకు భరోసా కల్పించడంతోపాటు.. వారికి అవసరమైన సాయం అందించడంలో ముందుంటున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ పేరుతో.. క్షేత్రస్థాయిలో పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. దీంతో ఆయా ప్రాంతాల్లో గిరిజనులకు పోలీసుల పట్ల నమ్మకం.. కుదిరింది. ఇన్నాళ్లు మావోయిస్టులు స్వాతంత్ర దినోత్సవం రోజు భయపెట్టి మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు.. జెండా పండుగలో పాల్గొనేందుకు ఆపేవారు. అయితే ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంతో పాటు పోలీసుల భరోసా తోడవడంతో స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నారు. ఈసారి జెండా పండుగలో స్వేచ్ఛగా పాల్గొన్నారు ఆ అడవి బిడ్డలు.

ఇంజరిలో గిరిజన బాలల దేశభక్తి..

ఇవి కూడా చదవండి

పెదబయలు మండలం ఇంజరి లో ప్రాథమిక పాఠశాల ఎదుట జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు టీచర్లు గ్రామస్తులు పాల్గొన్నారు. తొలిసారిగా రంగురంగుల జెండాలు ఆ ప్రాంతంలో రెపరెపలాయని అందరూ సంబరాలు చేసుకున్నారు. మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా అంటూ ఆ గిరిజన బాలలు దేశభక్తి గీతాన్ని స్వేచ్ఛగా ఆలపించారు. మరోవైపు జామిగూడ లోనూ జాతీయ జెండా ఆవిష్కరించారు. చింతపల్లి, జీకే వీధి పెదబయలు ముంచంగి పుట్టు మండలాల్లోనూ ఇన్నాళ్లు వేడుకలకు దూరంగా ఉన్న గిరిజనులు.. జాతీయ జెండా ఆవిష్కరించి సలాం చేశారు. మావోయిస్టులు గతంలో మారుమూల ప్రాంతాల్లో నల్ల జెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చేవారు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండడంతో గిరిజనులు అంతా సంబరాలు చేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..