AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెల 11న హైదరాబాద్‌లోని ఆ మాల్‌కు వెళ్లారా … అయితే, జాగ్రత్త

దుబాయ్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కూడా పాజిటివ్‌ వచ్చినట్లు ఈ ఉదయం తేలింది. దీంతో రాష్ట్రంలో ఏకంగా కరోనా పాటిజివ్‌ కేసుల సంఖ్య 16కు  చేరింది. ఈ నేపథ్యంలోనే నగరవాసులను మరో భయం వెంటాడుతోంది.

ఈ నెల 11న హైదరాబాద్‌లోని ఆ మాల్‌కు వెళ్లారా ... అయితే, జాగ్రత్త
Jyothi Gadda
|

Updated on: Mar 20, 2020 | 1:17 PM

Share

కరోనా మహమ్మారి తెలంగాణలోనూ రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన్నట్లు తెలిపారు అధికారులు. లండన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరికి.. టెస్టులు నిర్వహించారు . అయితే ఈ టెస్టుల్లో ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ధృవీకరించింది తెలంగాణ ఆరోగ్యశాఖ. దుబాయ్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కూడా పాజిటివ్‌ వచ్చినట్లు ఈ ఉదయం తేలింది. దీంతో రాష్ట్రంలో ఏకంగా కరోనా పాటిజివ్‌ కేసుల సంఖ్య 16కు  చేరింది. ఈ నేపథ్యంలోనే నగరవాసులను మరో భయం వెంటాడుతోంది. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మాల్‌లో సంచరించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారైనట్లుగా తెలిసింది. వివరాల్లోకి వెళితే…

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి దుబాయి నుంచి రాగా, ఆయనకు పాజిటివ్‌ అని తేలింది. ఈ నెల 14న ఆయన దుబాయి నుంచి వచ్చాడు. 17న కోవిడ్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో తక్షణమే గాంధీ ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు చేయగా, కోవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆయనతో కాంటాక్టు అయిన వారిని గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉంచారు. అయితే, సదరు వ్యక్తి ఈ నెల 11న పంజాగుట్టలోని గలేరియా మాల్‌ను సందర్శించినట్లుగా విచారణలో తెలిసింది. దీంతో ఆ రోజు గలేరియా మాల్‌కు వెళ్లిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని కోరింది.

తెలంగాణలో పెరిగిన కరోనా బాధితులతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. నిన్న కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం. కరోనా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం కేసీఆర్‌. మార్చ్‌ 1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కడున్నా.. వారిని గుర్తించి ఇంట్లోనే క్వారంటైన్‌ చేస్తామన్నారు. ఇక ఆలయాలు, చర్చి, మసీదులు మూసేయాలని కోరారు. పదోతరగతి పరీక్షలు మాత్రం యధాతథంగా సాగుతాయన్నారు. పబ్లిక్‌ మీటింగులు, బహిరంగ సభలపై నిషేధం విధించామని.. ప్రజలు ఒకదగ్గరే గుమిగూడొద్దన్నారు సీఎం. ఇక ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే 18 చెక్‌ పోస్టుల్లో చెకింగ్స్‌ జరిపి.. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తిస్తామని తెలిపారు.