హుజూరాబాద్‌లో కరోనా లక్షణాలు ! … వ్యక్తి మృతి
కొవిడ్-19: మహమ్మారి తెలంగాణలోనూ రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన్నట్లు తెలిపారు అధికారులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంలో ఓ వ్యక్తి జలబు, దగ్గు కారణంగా ....

కొవిడ్-19: మహమ్మారి తెలంగాణలోనూ రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన్నట్లు తెలిపారు అధికారులు. లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరికి.. టెస్టులు నిర్వహించారు . అయితే ఈ టెస్టుల్లో ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ధృవీకరించింది తెలంగాణ ఆరోగ్యశాఖ. దుబాయ్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కూడా పాజిటివ్ వచ్చినట్లు ఈ ఉదయం తేలింది.దీంతో రాష్ట్రంలో ఏకంగా కరోనా పాటిజివ్ కేసుల సంఖ్య 16 చేరింది. మరో వైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కల్లోలం రేపుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంలో ఓ వ్యక్తి జలబు, దగ్గు కారణంగా మృతిచెందటం ఇప్పుడు అధికారులను, అటు స్థానికులను మరింత కలవరపెడుతోంది. వారం రోజులుగా దగ్గు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న యువకుడు మెరుగైన చికిత్స కోసం గురువారం హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే అతడు మృతిచెందినట్లుగా తెలుస్తోంది.
జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన యువకుడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే వారం రోజులుగా వాంతులు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. గురువారం నాటికి సమస్య మరింత తీవ్రం కావడంతో ఈ నెల 18న జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాధితున్ని పరీక్షించిన వైద్యులు వైరల్ ఫివర్‌గా అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతన్ని వెంటనే హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మార్గ మధ్యలోనే అతడు మృతిచెందినట్లుగా హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు నిర్ధారించారు. అసలే జిల్లాను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో వ్యక్తి మృతి మరింత ఆందోళన కలిగిస్తోంది.