Coronavirus: ఏపీలో 3, తెలంగాణలో 16.. తెలుగురాష్ట్రాల్లో పెరుగుతోన్న కరోనా కేసులు

భారతదేశంలో చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. మొత్తం 20 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడగా.. నలుగురు మృత్యువాత పడ్డారు. బాధితుల సంఖ్య 200కు దగ్గరవుతుండగా..

Coronavirus: ఏపీలో 3, తెలంగాణలో 16.. తెలుగురాష్ట్రాల్లో పెరుగుతోన్న కరోనా కేసులు
Follow us

| Edited By:

Updated on: Mar 20, 2020 | 8:26 AM

భారతదేశంలో చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. మొత్తం 20 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడగా.. నలుగురు మృత్యువాత పడ్డారు. బాధితుల సంఖ్య 200కు దగ్గరవుతుండగా.. వేలల్లో అనుమానితులున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటు తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. బాధితుల సంఖ్య 16కు చేరింది. ఇక అటు ఏపీలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖలో ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 65ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వారు తెలిపారు. ఇటీవల ఆయన మక్కాకు వెళ్లి వచ్చారని.. ఆ తరువాత రెండుసార్లు హైదరాబాద్‌లోని ఆయన కుమార్తె ఇంటికి కూడా వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3కు చేరింది. ఇదిలా ఉంటే వైరస్‌కు అడ్డుకట్టవేసేందుకు అటు, ఇటు కేంద్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే విద్యా సంస్థలను బంద్ చేయించిన ప్రభుత్వాలు.. ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఇచ్చాయి.

Read This Story Also: మానవ మృగాలను ఉరి తీశారిలా..!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..