కరోనాలో కనిపించే మరో రెండు కొత్త లక్షణాలు.. ఇవి ఉన్నవారు కోలుకోవడం కష్టమే

కరోనాలో మరో రెండు కొత్త లక్షణాలు కనిపించాయని.. ఇవి ఉన్నవారు కోలుకోవడం కష్టమేనని అంటున్నారు వైద్యులు. కరోనా వైరస్‌ లక్షణాలకు సంబంధించి పరిశోధికులు మరో కీలక ప్రకటన చేశారు. సాధారణంగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకు సంబంధించి సమస్యలు..

కరోనాలో కనిపించే మరో రెండు కొత్త లక్షణాలు.. ఇవి ఉన్నవారు కోలుకోవడం కష్టమే
Follow us

| Edited By:

Updated on: Mar 19, 2020 | 9:51 PM

కరోనాలో మరో రెండు కొత్త లక్షణాలు కనిపించాయని.. ఇవి ఉన్నవారు కోలుకోవడం కష్టమేనని అంటున్నారు వైద్యులు. కరోనా వైరస్‌ లక్షణాలకు సంబంధించి పరిశోధికులు మరో కీలక ప్రకటన చేశారు. సాధారణంగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకు సంబంధించి సమస్యలు వస్తే అవి కరోనాకు సంబంధించినవేనని అందరికీ తెలిసినవే. ఈ లక్షణాలున్నవారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని పలువురు వైద్యులు చూపిస్తున్నారు కూడా. అయితే కరోనా సోకినప్పటికీ.. ఈ లక్షణాలేమీ కనిపించని వారిలో విరేచనాలు, జీర్ణ సంబంధిత లక్షణాలు, ఆకలి లేకపోవడం వంటివి కూడా ఉన్నట్లు తెలిపారు. ఇవి కూడా కరోనా సోకవడం వల్లే వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

కాగా ఈ రకమైన రెండో రకం కొత్త లక్షణాలు మరింత ప్రమాదకరమని అంటున్నారు. హుబే రాష్ట్రంలో మూడు ఆస్పత్రుల పరిధిలోని కరోనా పాజిటివ్ రోగులను అధ్యయనం చేశామన్నారు. వీరిలో 48.5 శాతం రోగులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువమంది జీర్ణ సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కరోనా సోకిన వారిలో కొందరికి.. శ్వాసకోశ ఇబ్బందులు ఉంటే.. మరికొందరిలో జీర్ణ సంబంధిత లక్షణలున్నాయన్నారు. మరికొందరికి ఇవి రెండూ ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ జీర్ణ సంబంధిత రుగ్మతలు ఉన్నవారు కోలుకోవడం చాలా కష్టమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఫలితాలను పూర్తిగా నిర్ధారించడానికి ఇంకా పెద్ద నమూనా అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్లు స్పష్టం చేశారు.

Read More this also:

నిర్భయ దోషుల్ని ఉరితీసే తలారికి ఎంత డబ్బు ఇస్తారంటే..

 జబర్దస్త్ నుంచి బయటకు పంపించేస్తే.. నేను ఇది చేయడానికి సిద్ధం

అలెర్ట్: ఆ గ్రూపు రక్తం ఉన్నవారికి కరోనా ఎక్కువగా సోకుతుందట

కరోనా వచ్చిందనే భయంతో యువకుడు సూసైడ్

పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌కి మరో బ్యాడ్ న్యూస్

సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది..

Latest Articles