సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది.. సామ్ సెన్సేషన్ కామెంట్స్

తాజాగా 'హైదరాబాద్‌ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019' టైటిల్‌ను సాధించిన సమంత.. ఓ ఇంగ్లీషు ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధార్థ్‌తో లవ్ ఎఫైర్ గురించి కూడా వెల్లడించడం సెన్సేషన్‌గా..

సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది.. సామ్ సెన్సేషన్ కామెంట్స్
Follow us

| Edited By:

Updated on: Mar 19, 2020 | 3:25 PM

అక్కినేని సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ‘ఏమాయ చేశావే’ సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించిన సమంత.. ఎన్నో హిట్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. పెళ్లి తర్వాత యాక్టింగ్‌కి పుల్‌స్టామ్ పెట్టేస్తుంది అనుకున్నారు. కానీ అటు ఫ్యామిలీని చక్కదిద్దుకుంటూ, ఇటు కెరీర్‌ పరంగా కూడా భారీ హిట్లను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. తాజాగా ‘హైదరాబాద్‌ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019’ టైటిల్‌నూ సాధించుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంగ్లీషు ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధార్థ్‌తో లవ్ ఎఫైర్ గురించి కూడా వెల్లడించడం సెన్సేషన్‌గా మారింది.

సమంత మాట్లాడుతూ.. తన మాజీ ప్రియుడితో ప్రేమ, బ్రేకప్ గురించి ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ప్రస్తావించడం జరిగింది. సావిత్రి గారి జీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంక్షోభాలు నా జీవితంలో కూడా చోటుచేసుకున్నాయి. కానీ వాటిని మొదటనే గ్రహించి.. నా కెరీర్‌ని చక్కదిద్దుకున్నా.. లేకుంటే.. నేను కూడా మరో సావిత్రిలా తయారయ్యేదాన్ని. ఆ రిలేషన్‌ నుంచి ఫాస్ట్‌గా బయటపడ్డాను.. కాబట్టే నా జీవితంలో పెద్ద ముప్పు నుంచి తప్పించుకున్నాని పేర్కొంది సమంత. అలాగే నాకు నాగచైతన్య లాంటి వ్యక్తి దొరకడం అదృష్టం. చైతూ నాకు భగవంతుడు ఇచ్చిన కానుక అని భావిస్తాను అని తెలిపింది. కాగా.. 2017లో నాగ్, సామ్‌ల పెళ్లి అంగరంగ వైభవంగా గోవాలో జరిగింది. క్రైస్తవ, హిందూ సంప్రదాయల ప్రకారం వీరి వివాహం జరిగింది.

ఏమాయ చేశావే సినిమా తర్వాత.. చైతూ, సామ్ మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత సిద్ధార్థ్‌తో ‘జబర్దస్త్’ అనే సినిమా చేసింది సామ్. ఈ సినిమాలోనే అతనితో ప్రేమలో పడింది. అది కాస్తా పెళ్లిదాకా వచ్చింది. దీంతో శ్రీశైలంలో వీరిద్దరూ కలిసి పూజలు కూడా చేశారు. మరి కొద్ది రోజుల్లోనే వీరి పెళ్లి జరుగుతుందని అనుకునే లోపే.. అనూహ్యంగా వీరి మ్యారేజ్‌కి బ్రేక్ పడింది.

Read More this also: నాగబాబు గురించి హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

‘చంద్రబాబు మృతి’ అంటూ వల్గర్ పోస్టులు.. మంగళగిరిలో కేసులు

హీరోయిన్‌ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..

దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం! 

ఇంటింటికి ఉచితంగా కిలో చికెన్ సప్లై.. గారెలతో కలిపి