తెలంగాణలో బాహుబలి సీన్..నెట్టింట్లో వైరల్!
ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఓ ఫేక్ వీడియో చక్కర్లు కొడుతూ జిల్లావాసులను గందరగోళానికి గురిచేస్తోంది. మూడు రోజులుగా ఓ బాలుడి ప్రాణాలు కాపాడిన తండ్రి ఫోటోలు వాట్సాప్ , ఫేస్ బుక్ ల్లో విఫరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఓ ఫేక్ వీడియో చక్కర్లు కొడుతూ జిల్లావాసులను గందరగోళానికి గురిచేస్తోంది. మూడు రోజులుగా ఓ బాలుడి ప్రాణాలు కాపాడిన తండ్రి ఫోటోలు వాట్సాప్ , ఫేస్ బుక్ ల్లో విఫరీతంగా వైరల్ అవుతున్నాయి. అది నిజమే అనుకుని నెటిజన్లు విఫరీతంగా ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం చింతకర్రకు చెందిన ఓ పసికందు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా, వైద్యం కోసం వాగు దాటిస్తున్నట్లు ఉన్న ఫొటోలో జిల్లా వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్నాయి. బాహుబలి స్టంట్ అంటూ వార్తలు సైతం ప్రసారమవుతున్నాయి. అయితే ఈ పోస్టు అనేక గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో టీవి9 ప్యాక్ట్ చేసింది. బాహుబలి సినిమాను తలపిస్తూ పసికందును వాగు దాటిస్తున్న ఈ వార్త ఇప్పటిది కాదని 2016 ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణం మన్యం ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన అని తేలింది.
నాలుగేళ్ల క్రితం అంటే 2016లో విశాఖ జిల్లా మన్యంకు చెందిన పాంగి సత్తిబాబు అనే వ్యక్తి తన చిన్నారికి తీవ్రవజ్వరం రావడంతో చింతపల్లి మండలం కుడుముసారె గ్రామం నుంచి లోతుగెడ్డ ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల కోసం తీసుకెళ్లాడు. అప్పట్లో ఈ వార్త సంచలనం రేపింది. సో ఈ ఫోటోలు ఇప్పటివి కావని ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఘటన అంతకంటే కాదని తేలింది. దీంతో ఇది ఫేక్ న్యూస్ అని, కావాలనే కొందరు ఆకతాయిలు ఈ వార్తను తాజాగా సోషల్ మీడియా వైరల్ చేసినట్టు సమాచారం.