త్వరలో హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ఛానెల్: వైవీ సుబ్బారెడ్డి
త్వరలో శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) హిందీ, కన్నడ భాషల్లో కూడా రానుందని, ఈ ఛానెల్‌ని పూర్తి హెచ్‌డీ ఛానెల్‌గా మార్చుతున్నామని
TTD Chairman YV Subba Reddy: త్వరలో శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) హిందీ, కన్నడ భాషల్లో కూడా రానుందని, ఈ ఛానెల్‌ని పూర్తి హెచ్‌డీ ఛానెల్‌గా మార్చుతున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇవాళ ఎస్వీబీసీ నూతన భవనాలను ఆయనప ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. 2007లో దివంగత సీఎం వైఎస్సార్ ఎస్వీబీసీ ఛానెల్‌కి రూపకల్పన చేశారని అన్నారు. ఆ తరువాత అన్ని ఏర్పాట్లు పూర్తై 2008 జూలైలో పూర్తి ప్రసారాలు ప్రారంభం అయ్యాయని గుర్తుచేశారు. తక్కువ సమయంలోనే ఎస్వీబీసీ భక్తుల మన్నన్నలు పొందిందని, ఈ క్రమంలో 2017లో తమిళ ఛానెల్ కూడా ప్రారంభం అయినట్లు వెల్లడించారు.
ఇక నూతన భవనాల్లో రెండు స్టూడియోలు, టెలీ పోర్టులు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అలాగే ఈ ఛానెల్‌ని యాడ్ ఫ్రీ ఛానెల్‌గా ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం భక్తుల నుంచి విరాళాలు కోరామని పేర్కొన్నారు. అంతేకాదు ఇప్పటికే 4 కోట్లు వచ్చాయని.. భక్తుల కోరిక మేరకు హిందీ, కన్నడ భాషల్లో కూడా ఛానళ్లు పెడుతున్నట్లు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
Read More: