AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: అబ్బా ఎంత అందంగా ఉందో.. ఇలాంటి చేపను మీరెప్పుడైనా చూశారా?

తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు నిత్యం, వింత వింత చేపలను చూస్తుంటారు. సముద్రంలో నివసించే రకరకాల చేపలు రోజూ వారి వలలకు చిక్కుతుంటాయి. ఇలానే తాజాగా ఒక జాలర్ వలకు ఒక వింత చేప చిక్కింది. చూడ్డానికి రంగురంగులుగా అది బలే అందంగా కనిపించింది. దాన్ని చూసిన జాలర్లు స్థానికులంతా తెగ ఆశ్చర్యపడిపోతున్నారు.

Andhra News: అబ్బా ఎంత అందంగా ఉందో.. ఇలాంటి చేపను మీరెప్పుడైనా చూశారా?
Andhra News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Nov 08, 2025 | 8:46 PM

Share

సముద్రంలో ఎన్నో రకాల జలచరాలు, జీవులు ఉంటాయి. రకరకాల చేపలు కూడా జీవనం సాగిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి రాయి చేప. రాయి చేపల్లోనూ వేరువేరు రకాలు, భిన్న రూపాలు, రంగులు కలిగిన చేపలు ఉంటాయి. చాలా అరుదుగా కనిపించే ఈ చేపలు.. అప్పుడప్పుడు జాలర్ల వలకు చిక్కుతూ ఉంటాయి. తాజాగా విశాఖకు చెందిన ఓ మత్స్యకారుడుకి ములుగు పాములు, ముళ్ళ కప్పలతో పాటు ఓ రాయి చేప కూడా చిక్కింది. వలలో ఉన్న అన్నింటిలోకెల్ల ఆ చేప ఆకారం, రంగు ఆ జాలర్‌కు ప్రత్యేకంగా కనిపించింది.

అది చూడ్డానికి పసుపు, నలుపు చారల తోకతో, బూడిద, తెలుపు రంగు శరీరాన్ని కలిగి ఉండి.. వాటిపై లైట్ బ్రౌన్ కలర్ గీతలతో విశేషంగా కనిపించింది. తోక రెక్కలపై పసుపు రంగు గుర్తులు ఉన్నాయి. రాయి చేపగా పిలుచుకునే వీటిని ఇండియన్ వాగాబాండ్ సీతాకోకచిలుక అని కూడా పిలుస్తారు. దీని పొడవు గరిష్టంగా 8 అంగుళాల వరకు ఉంటుంది. ఇవి పగడపు దిబ్బలు, శిధిలాలు, రాతి ప్రాంతాలు కలిగిన సముద్రపు అడుగున మనుగడ సాగిస్తూ ఉంటాయి. ఆహార అన్వేషణలో పైకి వచ్చి జాలర్ల వలకు చిక్కుతుంటాయి. అటువంటి వాటిలో ఎక్కువగా ముళ్లకప్పలు, ములుగు పాములు ఉంటాయి. వాటిలో కొన్నిటిని మత్స్యకారులు తిరిగి సముద్రంలో విడిచి పెడుతూ ఉంటారు.

ఇప్పుడు తాజాగా జాలర్‌ వలకు చిక్కిన చేప అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వింతగా, అందంగా కనిపించిన ఈ చేపను చూసి జనాలంతా తమ ఫోన్లతో వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ చేపకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.