AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: వీన్ని చూసి అమాయకుడనుకునేరు.. మనోడి.. బ్యాక్ గ్రౌండ్ తెలుసుకొని ఖాకీలే కంగుతిన్నారు!

విశాఖ మహానగరంలో పోలీసులు ఎంత నిఘాపెట్టినా.. రోజుకో స్టైల్ లో నేరస్తులు సవాల్ విసురుతూనే ఉన్నారు. అయినా స్మార్ట్ సిటీలో స్మార్ట్ పోలీసుల ముందు ఎంతటి కొమ్ములు తిరిగిన నెరగడైన తలవంచాల్సిందే. సిటీ పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే. తాజాగా నేరాల్లో ఆరితేరిపోతూ ప్రొఫెషనల్ కిల్లర్ గా మారిన ఓ నేరస్థుడిని పట్టుకున్నారు విశాఖ పోలీసులు.

Andhra News: వీన్ని చూసి అమాయకుడనుకునేరు.. మనోడి.. బ్యాక్ గ్రౌండ్ తెలుసుకొని ఖాకీలే కంగుతిన్నారు!
Andhra News (2)
Maqdood Husain Khaja
| Edited By: Anand T|

Updated on: Nov 08, 2025 | 7:11 PM

Share

విశాఖ జిల్లాలోని సీతమ్మధార ప్రాంతంలోని నివసిస్తున్న విక్రమాదిత్య వర్మ అనే వ్యక్తి ..ఇటీవలే తన కుటుంబంతో కలిసి వెస్ట్ గోదావరిలోని కొనితివాడ గ్రామానికి వెళ్లారు. బంధువుల ఇంటికి వెళ్ళి మూడురోజుల తరువాత తిరిగి వచ్చాడు. ఇంట్లో వెళ్లేందుకు గేట్‌ ఓపెన్‌ చేయగా.. షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. తన ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండి.. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న బీరువా తెరిచి ఉంది. వెంటనే బెడ్‌రూమ్‌లోకి వెళ్లి బీరువా తనిఖీ చేశాడు. అందులో ఉన్న 100 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో దొంగతనం జరిగినట్టు భావించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

దొంగను ఎలా గుర్తించారు..

బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన విశాఖ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. సీన్ ఆఫ్ అపెన్స్ లో ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు. ఎక్కడ దొంగ ఆచూకీ తెలిసినట్టు అనిపించడం లేదు. ఈలోగా ఓ సీసీఫుటేజ్‌లో.. అనుమానాస్పదంగా ఓ వ్యక్తి కదలికలు కనిపించాయి. అది కూడా అస్పష్టంగా ఉంది. దానిపై వర్కౌట్ చేసిన పోలీసులకు కీలక క్లూ చిక్కింది. అధునాతన సాంకేతిక వ్యవస్థలతో ఆ సీసీఫుటేజ్‌ను డెవలప్ చేశారు. దీంతో ఆ వ్యక్తి ఐడెంటిటీ గుర్తించేలా ఇన్వెస్టిగేషన్ ఫలించింది.

బాధ్యతగల ఉద్యోగం పోగొట్టుకొని దొంగగా

అయితే.. ఆ సీసి ఫుటేజీలో ఉన్న వ్యక్తి 33 ఏళ్ల బసవ కిరణ్‌గా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇతను గత కొన్ని రోజుల క్రితం విశాఖపట్నంకు మకాం మార్చాడు. ఎలాగోలా అతన్ని గుర్తించి విచారించిన పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే.. బసవ కిరణ్ కుమార్ ఓ మాజీ సైనిక ఉద్యోగి. క్రమశిక్షణ దేశభక్తికి మారుపేరుగా నిలవాల్సిన వయసులో ఇలా పక్కదారి పట్టినట్టు గుర్తించారు. కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడి నుంచి చోరీ సొత్తును రికవరీ చేశారు. అతన్ని కటకటాల వెనక్కు నెట్టారు.

శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టికి చెందిన బసవ కిరణ్ కుమార్.. డిఫెన్స్ లో పనిచేసేవాడు. ఎంతో దేశ సేవ చేయాలనే తపనతో ఉద్యోగం సంపాదించాడు. ఏమైందో ఏమో గాని.. క్రమశిక్షణ తప్పాడు. ఉద్యోగం పోయింది. ఇంటికి తిరిగి వచ్చి ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. బెట్టింగ్లు వ్యసనాల వైపు మళ్ళాడు. ఆ తర్వాత నేరాల బాట పట్టి ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేశాడు. చైన్ స్నాచింగ్లు చేయడం ప్రారంభించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నెరాలు చేసేసాడు. తాను ఉంటున్న ప్రాంతంతో పాటు బోర్డర్ లోని పొరుగు రాష్ట్రంలో మరో నేరం చేసేసాడు. దీంతో కాశి బుగ్గ ప్రాంతంలో 2, ఒడిశాలో మరో కేసులు అతనిపై నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

విశాఖకు మకాం మార్చి.. చోరీ చేసి..

ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన కిరణ్ కుమార్.. విశాఖకు మకాం మార్చేశాడు. విశాఖ సిటీలో పాత నేరాల స్టైల్ కు చెక్ పెట్టి.. అప్‌గ్రేడ్ అయ్యాడు. చైన్‌స్నాచింగ్స్‌ చేస్తే ఒక్క గొలుసు మాత్రమే దక్కుతుందని అనుకున్నాడో ఏమో గాని.. ఇల్లు కన్నం చేయాలని ప్లాన్ చేశాడు. హౌస్ బ్రేకింగ్ నేరానికి స్కెచ్ వేసుకొని ఇంట్లో చొరబడ్డాడు. ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకొని మూటగట్టుకుని పారిపోయాడు. ఎట్టకేలకు విశాఖ పోలీసులకు చిక్కడంతో వాడి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. చోరీ చేసిన సొత్తును హైదరాబాదులోని ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టినట్టు గుర్తించి రికవరీ చేశారు విశాఖ పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.