Monsoon update: సాగర తీరంలో తీరంలో ఈదురుగాలులు..ఏపీలో 2 రోజులు మోస్తరు వర్షాలు
Weather forecast
తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం మొదలైంది. నైరుతి రుతపవనాలు దేశ వ్యాప్తంగా ప్రవేశించడంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
నైరుతి రుతుపవనాల జోరు తగ్గిందని, పశ్చిమ గాలుల వల్ల వాయవ్య భారతదేశంలో మిగిలిన భాగాల్లో వీటి పురోగతి నెమ్మదించిందని వెల్లడించింది. దీంతో గురువారం , శుక్రవారం ఏపీలోని ఒకటి రెండు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో వచ్చే 48 గంటల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.
రాజస్తాన్, గుజరాత్, పంజాబ్, హరియాణ, ఢిల్లీల్లో రుతుపవనాల ప్రవేశానికి అంత అనుకూలంగా లేదని తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో దిగువ స్థాయిలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా.. మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు నెమ్మదిగా ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక తెలంగాణ రాష్ట్రాలోని దాదాపు అన్ని జిల్లాలో మోస్తారు వర్షాలు పడుతున్నాయి. దీంతో ఒప్పటికే రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. మరో మూడు రోజుల పాటు ఇదే స్థాయిలో వర్షం పడితే విత్తనాలు విత్తుకునే అవకాశం ఉందిని రైతులు ప్లాన్ చేసుకుంటున్నారు.