Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder: కర్నూలు జిల్లాలో భగ్గుమన్న పాతకక్షలు.. ఇద్దరు వ్యక్తులను వేట కొడవళ్లతో వెంటాడి నరికి చంపిన దుండగులు..

Murder: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో భీతావహ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో మరోసా పాత కక్షలు భగ్గుమన్నాయి. ఫలితంగా...

Murder: కర్నూలు జిల్లాలో భగ్గుమన్న పాతకక్షలు.. ఇద్దరు వ్యక్తులను వేట కొడవళ్లతో వెంటాడి నరికి చంపిన దుండగులు..
Murder
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 17, 2021 | 8:58 AM

Murder: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో భీతావహ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో మరోసా పాత కక్షలు భగ్గుమన్నాయి. ఫలితంగా ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిశాయి. గుర్తు తెలియని దుండగులు.. ఇద్దరు టీడీపీ నాయకులను వేటాడి, వెంటాడి అత్యంత క్రూరంగా చంపేశారు. అడ్డు వచ్చిన మరికొందరి కార్యకర్తలపై, వారి అనుచరులపైనా విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఇద్దరు టీడీపీ నాయకులు వడ్డు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి లను కొందరు దుండగులు వేట కొడవళ్లతో నరికి చంపేశారు.

వారిపై దాడి చేస్తుండగా అడ్డగించిన కార్యకర్తు, వారి అనుచచరుల పైనా దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డిలు స్పాట్‌లోనే చనిపోగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. హత్య జరిగిని తీరుపై స్థానికులను విచారిస్తున్నారు. అయితే, వీరి హత్యకు పాత కక్షలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also read:

Vontimitta Ramalayam: తెరుచుకున్న ఒంటిమిట్ట రామాలయం.. స్వామి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు..