Andhra Pradesh: ఆ గ్రామస్థులు వాగు దాటాలంటే సర్కస్ ఫీట్స్ చేయాల్సిందే.. తాళ్ల పై నడుస్తూ ప్రమాదకర ప్రయాణం.. ఎక్కడంటే
తమ గ్రామం నుంచి రంపచోడవరం వెళ్లాలంటే రోడ్లు సదుపాయం లేకపోవడంతో ఉన్న రహదారి చాలా దూరం కావడంతో.. గిరిజనులు వాగుపై తాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. తాళ్లనే బ్రిడ్జిగా చేసుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయింది. అయినప్పటికీ నేటికీ కనీస సదుపాయాలకు దూరంగా ఉన్న అనేక గ్రామాలున్నాయి. తాగడానికి నీరు, రవాణా సౌకర్యాలు వంటి కనీస సదుపాయాలకు ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలోని మన్యం జిల్లాల్లో అనేక గ్రామాలు రహదారి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.. స్కూల్ కు వెళ్లాలన్నా, వ్యాధి గ్రస్తులైనా, గర్భణీ స్త్రీలైనా అనేక ఇబ్బందులు పడాల్సిందే.. ఇటువంటి అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అల్లూరి జిల్లాలో వాగు దాటడం కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తాళ్ళపై ప్రయాణం చేస్తున్నారు కొంతమంది గ్రామస్థులు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని రంపచోడవరం బందమామిడి గ్రామస్తులు రహదారి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాగు మీద వంతెన లేకపోవడంతో.. స్టూడెంట్స్ స్కూల్ కు వెళ్లాలన్నా, గ్రామస్తులు ఏదైనా పనికోసం గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా వాగుని దాటడం కోసం తాళ్లను ఆశ్రయిస్తారు. తాళ్లపై నడుచుకుంటూ ప్రమాదకర ప్రయాణం చేస్తారు.
తమ గ్రామం నుంచి రంపచోడవరం వెళ్లాలంటే రోడ్లు సదుపాయం లేకపోవడంతో ఉన్న రహదారి చాలా దూరం కావడంతో.. గిరిజనులు వాగుపై తాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. తాళ్లనే బ్రిడ్జిగా చేసుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. వీటి మీద ప్రయాణిస్తూ .. సర్కస్ ఫీట్లు చేస్తూ .. నానా అవస్థలు పడుతూ.. రోజువారీ పనులు, నిత్యవసరాలు తెచ్చుకుంటున్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..