Andhra Pradesh: 40 రజక కుటుంబాల గ్రామ బహిష్కరణ.. వాళ్లు చేసిన తప్పేంటో తెలుసా?
శ్రీకాకులం జిల్లా జి.సిగడాం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాతువ గ్రామంలో 40 రజక కుటుంబాలను గ్రామస్తులు బహిష్కరించారు.
శ్రీకాకులం జిల్లా జి.సిగడాం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాతువ గ్రామంలో 40 రజక కుటుంబాలను గ్రామస్తులు బహిష్కరించారు. కులవృత్తి ధరలు పెంచాలని గతకొన్ని రోజులుగా గ్రామంలో రజకులు ఆందోళన చేస్తున్నారు. ధరలు పెంచకపోతే కులవృత్తి పనులు మానేస్తామని హెచ్చరించారు. దీంతో రజకులపై గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రజకులకు గ్రామంలో ఎలాంటి సహాయం చేయవద్దని గ్రామ పెద్దలు దండోరా వేయించారు. అన్ని విషయాల్లో గత రెండ్రోజులుగా గ్రామస్తులు రజకులను ఇబ్బందులు పెడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.
ఇదిలావుంటే, తమను గ్రామ బహిష్కరణ చేసిన దారుణంపై జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. అయినా కూడా గ్రామ పెద్దలు కనికరించలేదు. సాటి మనుషుల్ని కూడా మనుషులుగా చూడాలనే మానవత్వం కనిపలేదు. గ్రామంలోని రజకులు మాకు సహకరించట౦ లేదు కాబట్టి, మేమూ వాళ్లకు సహకరించేది లేదని గ్రామంలోని ఇతర కులస్తులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అ౦దిస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..