AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vellampalli Srinivas: కనుగుడ్డుపై గీతలు పడ్డాయి.. కుట్ర, హత్యా రాజకీయాలు ఆపాలి: వెల్లంపల్లి శ్రీనివాస్

సీఎం జగన్‌పై దాడి ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను అంతమొందించేందుకు ప్లాన్ చేశారంటూ శ్రీనివాస్ పేర్కొన్నారు. జగన్‌ను అంతమొందిస్తేనే మనుగడ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు.. కావాలని దాడి చేయించుకుంటే కనుగుడ్లు పోగొట్టుకుంటారా? అంటూ ప్రశ్నించారు. జగన్‌కు మరోచోట తగిలి ఉంటే పరిస్థితి ఏంటి? అంటూ పేర్కొన్నారు.

Vellampalli Srinivas: కనుగుడ్డుపై గీతలు పడ్డాయి.. కుట్ర, హత్యా రాజకీయాలు ఆపాలి: వెల్లంపల్లి శ్రీనివాస్
Vellampalli Srinivas
Shaik Madar Saheb
|

Updated on: Apr 14, 2024 | 4:44 PM

Share

సీఎం జగన్‌పై దాడి ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను అంతమొందించేందుకు ప్లాన్ చేశారంటూ శ్రీనివాస్ పేర్కొన్నారు. జగన్‌ను అంతమొందిస్తేనే మనుగడ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు.. కావాలని దాడి చేయించుకుంటే కనుగుడ్లు పోగొట్టుకుంటారా? అంటూ ప్రశ్నించారు. జగన్‌కు మరోచోట తగిలి ఉంటే పరిస్థితి ఏంటి? అంటూ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని.. ఈ సమయంలో టీడీపీ సానుభూతి అవసరం లేదన్నారు. కాని దాడి ఘటనపై రాజకీయాలు చేయొద్దన్నారు. పూర్తి విచారణ జరిపితే చంద్రబాబు బండారం బయట పడుతుందంటూ పేర్కన్నారు. ప్రాణహాని తలపెట్టాలనే దాడి చేశారు.. చంద్రబాబు కుట్ర, హత్యా రాజకీయాలు ఆపాలి అంటూ పేర్కొన్నారు. సీఎం జగన్‌కు భద్రత పెంచాలి అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తనకు కనుగుడ్డుపై గీతలు పడ్డాయని చికిత్స పొందుతున్నానని తెలిపారు.

ఈ మేరకు.. సింగ్‌నగర్‌ పోలీసులకు వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారం దురుద్దేశంతో దాడి చేశారని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రెండో రోజు ఎమ్మెల్యే వెల్లంపల్లికి వైద్యులు చికిత్స అందించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కంటికి తీవ్రమైన గాయమైందని నిర్ధారించారు. వెల్లంపల్లి ఎడమకన్నుఎరుపు రంగులోకి మారిందని.. విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రకటించారు.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. ఘటన జరిగిన ప్రాంతంల్లో డ్రోన్ల సాయంతో ఆధారాలు గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దర్యాప్తునకు 20 మందితో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు.. మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..