AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kesineni Nani: బీజేపీ నేత సత్య కుమార్‌కు ఎంపీ కేశినేని నాని పరామర్శ.. ఫైర్ అవుతున్న తెలుగు తమ్ముళ్లు.. ఎందుకంటే..

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ కారుపై రాళ్ల దాడి ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. మందడం సమీపంలో జరిగిన ఈ ఘటనపై బీజేపీ సహా.. విపక్ష పార్టీల నేతలు సైతం అధికార పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Kesineni Nani: బీజేపీ నేత సత్య కుమార్‌కు ఎంపీ కేశినేని నాని పరామర్శ.. ఫైర్ అవుతున్న తెలుగు తమ్ముళ్లు.. ఎందుకంటే..
Satya Kumar, Kesineni Nani
Shaik Madar Saheb
|

Updated on: Apr 02, 2023 | 11:40 AM

Share

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ కారుపై రాళ్ల దాడి ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. మందడం సమీపంలో జరిగిన ఈ ఘటనపై బీజేపీ సహా.. విపక్ష పార్టీల నేతలు సైతం అధికార పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని పరామర్శ.. బీజేపీ నేత సత్యకుమార్‌ను పరామర్శించడం.. తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహానికి దారితీసింది. సొంత పార్టీ నేతలపై దాడి జరిగినప్పుడు.. ఇలా ఎందుకు పరామర్శించలేదు అంటూ ఎంపీపై ఫైర్ అవుతున్నారు.

గుంటూరు జిల్లా మందడంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ కారుపై.. రాళ్ల దాడి అనంతరం ఎంపీ కేశినేని నాని పరామర్శించారు. విజయవాడలోని ఓ హోటల్ లో సత్యకుమార్ ను కలిసి.. పలు విషయాలపై మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను కేశినేని భవన్ శనివారం ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ పై అధికార పార్టీ వైసీపీ అమానుష దాడిని ఖండిస్తూ ఒక ప్రైవేట్ హోటల్లో ఆయన్ను కలసి పరామర్శించి, ఎంపీ కేశినేని నాని, టీడీపీ నగర నాయకులు సంఘీభావం తెలిపినట్లు కేశినేని భవన్ ట్విట్ లో పేర్కొంది. ఈ సందర్భంగా ఫొటోలను షేర్ చేసింది.

అయితే, ఈ ట్విట్ టీడీపీ నాయకుల్లో ఆగ్రహానికి దారితీసింది. తెలుగు తమ్ముళ్లు కేశినేని నానిని వ్యతిరేకిస్తూ రీట్విట్లు చేస్తున్నారు. టీడీపీ నేతలపై దాడులు జరిగిన సమయంలో ఎక్కడ దాక్కున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు ఈ సారి కేశినేనికి టికెట్ ఇవ్వొద్దంటూ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుకు సూచిస్తున్నారు.

‘‘దొంతు చిన్న, పట్టాభి మీద పోలీసులు దొంగ కేసులు పెట్టీ అరెస్ట్ చేసినప్పుడు మాత్రం ఇంట్లొ ఏసీలో పడుకుని ఉంటారు.. బీజేపీ మీద దాడి అనగానే సానుభూతి. కృష్ణ జిల్లాలో టిడిపినీ బ్రష్టు పట్టించినంతగా.. ఏ జిల్లాలోను జరగలేదు.’’ అంటూ ఓ నెటిజన్ ట్విట్ చేయగా.. ‘‘బీజేపీలో జాయిన్ అవ్వండి’’ అంటూ మరొకరు.. ‘‘స్వపక్షం విపక్షం అంటే ఈయనే.. టిడిపి వాళ్లపై దాడులు జరిగితే సైలెంట్’’.. అంటూ ఇంకొకరు రిట్వీట్లు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. గత కొన్ని రోజుల నుంచి టీడీపీ కార్యక్రమాలల్లో  పాల్గొనడంలేదని.. అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు తెలుగు తమ్ముళ్లు.. అంతకుముందు సైతం కేశినేని నానా మాట్లాడుతూ.. చంద్రబాబు సీటు ఇవ్వకున్నా ఏమీ కాదని.. ప్రజలు పోటీ చేయమంటే ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపాయి. తాజాగా.. తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ట్విట్లపై కేశినేని నాని ఎలా స్పందిస్తారన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..