Andhra Pradesh: నాగరాజు హత్య కేసులో సంచలన నిజాలు.. తమ్ముడి అక్రమ సంబంధమే కారణమా?

సాప్ట్ వేర్ ఇంజినీర్ నాగరాజు హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. చంద్రగిరి పీఎస్‌కు చేరుకున్న నాగరాజు భార్య సులోచన, కుటుంబ సభ్యులు కీలక వివరాలు వెల్లడించారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో తన భర్త నాగరాజుకు గోపి అనే వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చిందని..

Andhra Pradesh: నాగరాజు హత్య కేసులో సంచలన నిజాలు.. తమ్ముడి అక్రమ సంబంధమే కారణమా?
Software Nagaraju
Follow us

|

Updated on: Apr 02, 2023 | 11:30 AM

సాప్ట్ వేర్ ఇంజినీర్ నాగరాజు హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. చంద్రగిరి పీఎస్‌కు చేరుకున్న నాగరాజు భార్య సులోచన, కుటుంబ సభ్యులు కీలక వివరాలు వెల్లడించారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో తన భర్త నాగరాజుకు గోపి అనే వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చిందని, 9.20 గంటల తరువాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్‌ అయిందని తెలిపారు. అయితే, తన మరది పురుషోత్తానికి బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మరో వివాహితతో సంబంధం ఉందని, రెండు నెలలుగా ఈ విషయంలోనే గొడవలు జరుగుతున్నాయని వెల్లించింది సులోచన. ఇదే విషయమై కాంప్రమైజ్ చేయడానికి తన భర్త నాగరాజుకు ఫోన్ చేసి రావాలన్నారని చెప్పింది.

కాగా, ఈ అక్రమ సంబంధం విషయంలోనే తన తమ్ముడు పురుషోత్తమ్‌ను చంపుతామని ప్రత్యర్థులు బెదిరించడంతో అతన్ని బెంగళూరుకు పంపించాడు అన్న నాగరాజు. ఈ వ్యవహారంలో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని సులోచన వాపోయింది. తన భర్తను హత్య చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది నాగరాజు భార్య సులోచన.

పోలీసులు తెలిపిన వివరాలివి..

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగరాజు హత్య కేసును చంద్రగిరి సీఐ ఓబులేషు వివరించారు. పక్కా ప్లాన్‌తోనే హత్య జరిగిందని వెల్లడించారు. ఈ హత్య ఘటనలో బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రూపంజయ, గ్రామ సర్పంచ్ చాణిక్యతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నామని, ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..