AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చంద్రగిరిలో దారుణం.. కారులో వ్యక్తిని కట్టేసి నిప్పంటించిన దుండగులు..

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లి ఘాట్‌లో దారుణం చోటు చేసుకుంది. గురుప్పకనుమ వద్ద కారులో ఒక వ్యక్తిని కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు దుండగులు. అనంతరం కారును లోయలోకి తోసి పారిపోయారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా..

Andhra Pradesh: చంద్రగిరిలో దారుణం.. కారులో వ్యక్తిని కట్టేసి నిప్పంటించిన దుండగులు..
Tirupati Murder
Shiva Prajapati
|

Updated on: Apr 02, 2023 | 11:10 AM

Share

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లి ఘాట్‌లో దారుణం చోటు చేసుకుంది. గుర్రప్పకనుమ వద్ద కారులో ఒక వ్యక్తిని కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు దుండగులు. అనంతరం కారును లోయలోకి తోసి పారిపోయారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఘాట్ రోడ్డులో వెళ్తున్న వాహనదారులు కారు తగలబడుతున్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అలర్ట్ అయిన చంద్రగిరి, రామచంద్రపురం పీఎస్ పోలీసులు.. ఘటనా స్థలానికి పరిశీలించారు. కారులో సజీవదహానమైన వ్యక్తి నాగరాజు అనే వ్యక్తిగా గుర్తించారు. వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజుగా గుర్తించి.. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ప్రమాద స్థలికి చేరుకుని, మంటల్లో తగలబడుతున్న కారు నాగరాజుది గా గుర్తించారు. కాగా, కారు దగ్ధమైన చోట మరో రెండు బైక్ లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఘటన స్థలం వద్ద నాగరాజు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నాగరాజు.. ప్రస్తుతం గ్రామంలోనే వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్  క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!