AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arasavalli: అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులు పూర్తి.. సూర్యనారాయణ మూర్తి దర్శనానికి చేరుకున్న రైతులు

అమరావతి రైతులు చేపట్టిన అమరావతి టు అరసవిల్లి పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వరకు వచ్చి అక్టోబర్ 23 తో ఆగిపోయింది. అయితే తర్వాత కూడా పాదయాత్రను కొనసాగించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎలాగైనా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించాలని అమరావతి రైతులు భావించారు.

Arasavalli: అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులు పూర్తి.. సూర్యనారాయణ మూర్తి దర్శనానికి చేరుకున్న రైతులు
Amaravati Farmers
Surya Kala
|

Updated on: Apr 02, 2023 | 7:18 AM

Share

ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని.. మూడు రాజధానులు వద్దు, అమరావతి మాత్రమే ముద్దు అంటూ  అమరావతి రైతులు ఉద్యమం మొదలు పెట్టారు. అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులు పూర్తి అవ్వటంతో శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి చేరుకున్నారు అమరావతి రైతులు. గతంలో అమరావతి రైతులు చేపట్టిన అమరావతి టు అరసవిల్లి పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వరకు వచ్చి అక్టోబర్ 23 తో ఆగిపోయింది. అయితే తర్వాత కూడా పాదయాత్రను కొనసాగించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎలాగైనా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించాలని అమరావతి రైతులు భావించారు. దీంతో శనివారం నేరుగా అమరావతి నుంచి బయలుదేరి బస్సులు, కారులలో అరసవల్లికి చేరుకున్నారు.

శనివారం అర్ధరాత్రి వరకు రైతులు వస్తూ ఉన్నారు. ఇలా వచ్చిన అమరావతి రైతులకు స్థానిక టిడిపి నాయకులు అరసవల్లి లోని పలు ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ లో రాత్రికి బస ఏర్పాటు చేశారు. శనివారం అర్ధరాత్రి బస్సులలో అరసవిల్లికి చేరుకున్న అమరావతి రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రైతులతో పాటు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథం కూడా అరసవల్లికి చేరుకుంది. ఆదివారం ఉదయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు అమరావతి రైతులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది