Kesineni Nani Vs Chinni: మరోసారి తమ్ముడిపై పరోక్ష విమర్శలు చేసిన విజయవాడ ఎంపీ.. తారాస్థాయికి చేరిన కేశినేని బ్రదర్స్ వార్..

రెండు రోజుల క్రితం కేశినేని చిన్నిని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసిన టీడిపీ ఎంపీ కేశినేని శ్రీ‌నివాస్ అలియాస్ నాని.. మరోసారి తమ్ముడిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దానధర్మాలు చేస్తున్నవారికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి..

Kesineni Nani Vs Chinni: మరోసారి తమ్ముడిపై పరోక్ష విమర్శలు చేసిన విజయవాడ ఎంపీ.. తారాస్థాయికి చేరిన కేశినేని బ్రదర్స్ వార్..
Kesineni Brothers
Follow us

|

Updated on: Jan 17, 2023 | 7:06 AM

రెండు రోజుల క్రితం కేశినేని చిన్నిని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసిన కేశినేని నాని.. మరోసారి తమ్ముడిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దానధర్మాలు చేస్తున్నవారికి ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయో వెలికితీయండంటూ తన తమ్ముడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని. ఇటీవలి కాలంలో కేశినేని ఫౌండేషన్ ద్వారా విజయవాడ పార్లమెంట్ పరిధిలో పలు సేవాకార్యక్రమాలు చేస్తున్నారు కేశినేని చిన్ని. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని పరోక్షంగా ‘ ఫౌండేషన్ పేరుతో నాలుగు చీరలు పంచుతూ.. నలుగురు పేద వారికి డబ్బులిచ్చి వారి వెనక తిప్పించుకుంటున్నారు. అసలు ఈ దానధర్మాలు చేసే డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో వెలికి తీయండి. ఫౌండేషన్ పెట్టి సేవా కార్యక్రమాలు చేయాలంటే నేను 200 ట్రస్టులు తెచ్చి సేవ చేస్తాను’ అని అన్నారు.

ఇలా అన్నదమ్ముల మధ్య మొదలైన పంచాయితీ పీక్ స్టేజీకి చేరినట్లయింది. ఇక చిన్నికి పార్టీ టికెట్ ఇస్తే తన మద్ధతు ఉండబోదని కేశినేని నాని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే నందిగామ నియోకవర్గంలో రెండు రోజుల పాటు సాగిన కేశినాని పర్యటనలో స్థానిక టీడీపీ ఇంచార్జీ తంగిరాల సౌమ్య కనిపించలేదు. ఈ క్రమంలో సౌమ్య లేకపోయినా తమ నాయకుడి బలం నిరూపించుకునేందుకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది కేశినేని నాని వర్గం.

కాగా, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పార్టీ ప‌రిస్థితులు, అన్న నాని గెలుపు అవ‌కాశాలపై ఎప్పటిక‌ప్పుడు పరిశీలిస్తే.. నాని గెలుపులో కీల‌క పాత్ర పోహించారు చిన్ని. గత ఏడాది అగస్టు నుంచి ఇద్దరి మ‌ధ్య విభేదాలు రావ‌టంతో కేశినేని నానికి దూరంగా ఉంటున్నారు చిన్ని. అయితే, త‌న ఎంపీ కారు స్టిక్కర్‌ను దుర్వినియోగం చేస్తున్నారంటూ విజ‌య‌వాడ‌ ప‌ట‌మ‌ట పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు ఎంపీ నాని. దీంతో నాని, చిన్ని మ‌ధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles