AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narendra Modi: ఢిల్లీలో ప్రధాని మోదీ భారీ రోడ్ షో.. ఆపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. చర్చించనున్న ప్రధానాంశాలివే..

జనవరి 16-17 తేదీల్లో దేశ రాజధానిలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం ఆ పార్టీ మొదటిరోజు భారీ రోడ్‌షోను నిర్వహించనుంది. దాదాపు ఒక కిలో మీటర్ మేర జరగనున్న ఈ రోడ్‌షోలో వివిధ రాష్ట్రాలకు..

Narendra Modi: ఢిల్లీలో ప్రధాని మోదీ భారీ రోడ్ షో.. ఆపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. చర్చించనున్న ప్రధానాంశాలివే..
Pm Modi Roadshow In Delhi
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 16, 2023 | 7:39 AM

Share

జనవరి 16-17 తేదీల్లో దేశ రాజధానిలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం ఆ పార్టీ మొదటిరోజు భారీ రోడ్‌షోను నిర్వహించనుంది. దాదాపు ఒక కిలో మీటర్ మేర జరగనున్న ఈ రోడ్‌షోలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు రోడ్ల వెంట నిల్చోనున్నారు. ఇటీవల జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ సాధించిన ఘనవిజయం తర్వాత ఆ పార్టీ జరుపుతున్న తొలి ప్రధాన సమావేశం ఇదే కావడం గమనార్హం.

అయితే ఈ రోజు(జనవరి) సాయంత్రం 4 గంటల నుంచి ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభవనున్న బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాలు , రేపు(17 జనవరి) సాయంత్రం 4 గంటలకు ముగుస్తాయి. ఇక ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు 35 మంది కేంద్ర మంత్రులు, 12 మంది బీజేపీ ముఖ్యమంత్రులు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు, 37 రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షులు, మరో 27 మంది (సంఘటన్ మంత్రులు, మహా మంత్రులు, క్షేత్రీయ సంఘటన్ మంత్రులు) పాల్గొంటారు. అలాగే 19 మంది మాజీ ముఖ్యమంత్రులు, 12 మంది మాజీ ఉప ముఖ్యమంత్రులు, 17మంది ఫ్లోర్ లీడర్లు, 168 మంది లోక్‌సభ, రాజ్యసభ చీఫ్ హెడ్‌లు, 182 ఇతర సభ్యులు కూడా ఈ సమావేశంలో భాగం కానున్నారు. మొత్తం 350 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు.

కార్యవర్గ సమావేశంలోని ప్రధాన అజెండాలివే:

రెండు రోజుల పాటు జరగనున్న ఈ బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో మొత్తం 6 అంశాలపై ప్రజెంటేషన్ జరుగుతుంది. సేవా, సంఘటన్, సమర్పణ్, విశ్వగురు భారత్, సుశాసన్ సర్వ ప్రథమ్ (గవర్నెన్స్ ఫస్ట్), సమావేశ్, సశక్త్ భారత్, సంస్కృతి సంవాహ్, ప్రతి పక్షం హోదాలో ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాలు, ఎజెండాలో అంశాలు వంటివి చర్చకు వస్తాయి. వీటితో పాటు.. దేశంలోని ప్రధాన సమస్యలు, రాజకీయ, సామాజిక సమస్యలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలతో పాటు రానున్న 9 రాష్ట్రాల్లో ఎన్నికలపై చర్చ, లోక్‌సభ ప్రవాస్ యోజన, బూత్ సశక్తీకరణ్ వంటి వివిధ అంశాలపై చర్చ జరుగుతంది. ఈ అంశాలపై జాతీయ అధ్యక్షుడు నడ్డా, ప్రధాని మోదీ పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అందరికీ మిల్లెట్స్ మీల్స్ వడ్డిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ పోలీసుల ట్రాఫిక్ అడ్వైజరీ:

సోమవారం(జనవరి 16) దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షో జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ‘బీజేపీ జనవరి 16న మధ్యాహ్నం 3 గంటలకు సంసద్ మార్గ్‌లో పటేల్ చౌక్ నుంచి సంసద్ మార్గ్-జై సింగ్ రోడ్ జంక్షన్ వరకు పెద్ద ఎత్తున రోడ్ షోను నిర్వహిస్తోంది. భారత ప్రధాని మోదీ ఈ రోడ్ షోలో పాల్గొనున్నారు. రోడ్‌షో దారికి సమీపంలో ట్రాఫిక్ నిర్వహణ సజావుగా ఉండేలా ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు ఉంటాయి’ అని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

అశోక రోడ్, సన్సద్ మార్గ్, టాల్‌స్టాయ్ రోడ్, రఫీ మార్గ్, జంతర్ మంతర్ రోడ్, ఇంతియాజ్ ఖాన్ మార్గ్, బంగ్లా సాహిబ్ మధ్య ఈ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోడ్లు మూసివేసి ఉంటాయని ట్రాఫిక్ అడ్వైజరీ పేర్కొంది. ఇదే క్రమంలో రోడ్‌షో  కారణంగా బాబా ఖరక్ సింగ్ రోడ్, ఔటర్ సర్కిల్ కన్నాట్ ప్లేస్, పార్క్ స్ట్రీట్/శంకర్ రోడ్, మింటో రోడ్, మందిర్ మార్గ్, బరాఖంబా రోడ్, పంచకుయిన్ రోడ్, రైసినా రోడ్, టాల్‌స్టాయ్ రోడ్, జన్‌పథ్, ఫిరోజ్‌షా రోడ్, రఫీ మార్గ్, రాణి ఝాన్సీ రోడ్, DBG రోడ్, చెమ్స్‌ఫోర్డ్ రోడ్, భాయ్ వీర్ సింగ్ మార్గ్, DDU మార్గ్, రంజిత్ సింగ్ ఫ్లైఓవర్, తల్కతోరా రోడ్, పండిట్ పంత్ మార్గ్ మార్గాలలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..