PM Modi: నేడు ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. సదస్సులో 65 దేశాల ప్రతినిధులు..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ను నేడు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ కూడా చేశారు. ‘ఈ రోజు ఉదయం..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ను నేడు(జనవరి 11) ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ కూడా చేశారు. ‘ఈ రోజు ఉదయం 11 గంటల 10 నిముషాలకు మధ్యప్రదేశ్ – గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తాను. ఈ సమ్మిట్‌లో మధ్యప్రదేశ్‌లో విభిన్న పెట్టుబడి అవకాశాలను ప్రదర్శనలు ఉంటాయి’ అని మోదీ తన ట్వీట్‌లో తెలిపారు. సదస్సు ప్రారంభం సందర్భంగా కార్యక్రమంలో సురినేమ్ ప్రెసిడెంట్ చంద్రికా ప్రసాద్ సంతోఖి, గయానా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ కూడా హాజరవుతారు. పర్యావరణ పరిరక్షణ కోసం ‘మధ్యప్రదేశ్-భవిష్యత్ కోసం సిద్ధమైన రాష్ట్రం’ అనే థీమ్‌తో జరగనున్న ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం కార్బన్ న్యూట్రల్, జీరో వేస్ట్.
కార్యక్రమం కోసం ఇండోర్‌లో జరుగుతున్న ఏర్పాట్లను నిన్న సమీక్షించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ‘ రాష్ట్ర విధివిధానాలను ప్రోత్సహించడం, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలను రూపొందించి ప్రోత్సహించడం, పారిశ్రామిక సంస్థలు-పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, మరిన్ని అవకాశాలను కల్పించడం ఈ శిఖరాగ్ర సదస్సు లక్ష్యమ’ని తెలిపారు.
At around 11:10 AM today, I will be sharing my remarks at the Invest Madhya Pradesh – Global Investors Summit 2023 via video conferencing. This Summit will showcase the diverse investment opportunities in Madhya Pradesh.
— Narendra Modi (@narendramodi) January 11, 2023
కాగా, రెండు రోజుల పాటు జరిగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో 65కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ సదస్సలో.. 9 భాగస్వామ్య దేశాలు, 14 అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు తమ దేశాలకు సంబంధించిన విభిన్న అంశాలను ప్రదర్శిస్తాయి. అంతేకాక భారతదేశంలోని 500 మందికి పైగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వివిధ అంశాలపై 19 సెషన్లలో జరుగుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.