Modi-Karnataka: కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటనలు.. వారం రోజుల తేడాతో రెండు సార్లు.. నేపథ్యం ఏమిటంటే..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జనవరిలో రెండుసార్లు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. జనవరి 12న హెబ్భళ్లిలో జరగనున్న జాతీయ యువజనోత్సవాలను మోదీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జనవరిలో రెండుసార్లు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. జనవరి 12న హెబ్భళ్లిలో జరగనున్న జాతీయ యువజనోత్సవాలను మోదీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రెండో పర్యటనలో భాగంగా నారాయణపుర డ్యాం ఆధునికీకరించిన ఎడమ గట్టు కాలువను జనవరి 19న మోదీ ప్రారంభించనున్నారు. జనవరి 12న హుబ్బళ్లి రైల్వే గ్రౌండ్‌లో నిర్వహించనున్న జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా ఆక్కడకు వస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.
అయితే ఏడు రోజులపాటు ‘విక్షిత్ యువ – విక్షిత్ భారత్’ పేరుతో జరిగే ఈ కార్యక్రమంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన యువత పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆ సందర్భంగా యువతను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించనున్నారని సీఎం బొమ్మై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 7500 మందికి పైగా యువత పాల్గొంటారని తెలిపిన బొమ్మై అంతకుముందుగానే జనవరి 7న ఉత్సవాల లోగో, మస్కట్‌ను విడుదల చేశారు.
అలాగే నారాయణపుర ఎడమ గట్టు కాలువ (ఎన్‌ఎల్‌బిసి) ఆధునీకరణ ప్రాజెక్టును అంకితం చేసేందుకు ప్రధాని జనవరి 19న కర్ణాటకలో పర్యటింనున్నారని ఆయన తెలిపారు. NLBC ఆధునికీకరణ రాష్ట్ర పనులను కోసం రాష్ట్ర, కేంద్ర నిధులను ఉపయోగించి పూర్తి చేశారు. ఇక NLBC సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (SCADA) డిపెండెడ్ ఆటోమేషన్ సిస్టమ్‌ను మెగా స్కేల్‌లో కలిగి ఉంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..