AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..

విజయవాడలో వీధి కుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. పలు ప్రాంతాల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. రాత్రి 8 గంటలు దాటితే బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh: విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..
Stray Dog Menace Grips Vijayawada
M Sivakumar
| Edited By: Krishna S|

Updated on: Oct 22, 2025 | 2:00 PM

Share

విజయవాడలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. న్యూ రాజరాజేశ్వరపేట, భరతమాత కాలనీ, వాంబే కాలనీ, పాయకాపురం, ప్రశాంతినగర్, ఉడాకాలనీ, రాధా నగర్, హెచ్ బ్లాక్ వంటి పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా వీధి కుక్కలు ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత ఈ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన దాడుల వల్ల ఈ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 8 గంటలు దాటితే బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. చిన్నారులను ఒంటరిగా స్కూల్‌కు పంపాలంటే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలు కూడా కుక్క కాటుకు గురైన సంఘటనలు నమోదయ్యాయి. వాహనాలపై వెళ్తున్నవారు లేదా నడుచుకుంటూ రోడ్లపైకి రావడానికి ప్రజలు భయపడుతున్నారు.

ఉడా కాలానికి చెందిన దుర్గారావు అనే వ్యక్తి ఫర్నిచర్ షాపులో విధులు ముగించుకొని వస్తుండగా కుక్కలు వెంటపడటంతో కంగారుగా వెళ్లి గుంతలో పడిపోయాడు. కుక్క వెంటనే దాడి చేసి అతన్ని గాయపరిచింది. న్యూ రాజరాజేశ్వరిపేట ఆంజనేయ స్వామి గుడి సమీపంలో నివసించే సుబ్బారావు అనే వ్యక్తి డాబా కొట్టు సెంటర్‌లో ఆటో దిగి డబ్బులు ఇస్తుండగా కుక్క వచ్చి అతని పిక్క పట్టుకుని గాయపరిచింది. గాంధీనగర్‌లోని బంగారం షాపులో పనిచేసే మరో వ్యక్తి రాత్రి 10 గంటల తర్వాత నడుచుకుంటూ ఇంటికి రావాల్సి వస్తుంది. ఈ క్రమంలో కుక్కలు గుంపులుగా వెంటపడుతుండటంతో ప్రతి రోజు సాహసం చేసి రావాల్సిన పరిస్థితి వస్తుందని వాపోయాడు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన

కుక్కల బెడద గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సరిగా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. నెలలో సుమారు 10 మందికి పైగా కుక్కల దాడులకు గురవుతున్నారని వారు తెలిపారు. కుక్క కాటు దాడుల గురించి వీఎంసీ వెటర్నరీ సర్జన్ సోమశేఖర్ రెడ్డిని వివరణ కోరగా.. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్న పలు ప్రాంతాలను గుర్తించి, వాటి నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సురక్షితంగా బయటకు తిరిగేందుకు వీలుగా అధికారులు ఈ సమస్యపై తక్షణమే దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా