Vijayawada: దుర్గమ్మా నీ దర్శనానికి వస్తే.. 4వ అంతస్థు కిటికీలో నుంచి పడి 4 ఏళ్ల చిన్నారి మృతి
విజయవాడ మాచవరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో పైనుంచి పడి నాలుగేళ్ల చిన్నారి చనిపోయింది. ఆడుకుంటూ నాలుగో అంతస్తు నుంచి జారిపడింది చిన్నారి. చిన్నారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు.
అప్పటివరకు అన్నతో కలిసి దొంగా పోలీస్ ఆడుకున్న ఆ పాప.. అంతలోనే విగతజీవిగా మారిపోయింది. ముద్దు ముద్దు మాటలతో.. తమ కళ్ల ముందు నవ్వుతూ తిరుగుతున్న పాప ఆకస్మాత్తుగా మరణించడంతో.. తల్లిండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. విజయవాడ మాచవరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో ఆడుకుంటున్న పాప.. 4వ ఫ్లోర్ రూమ్‌లోని కిటికీ నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయి మృతి చెందింది. కనకదుర్గ దర్శనం కోసం విశాఖ నుంచి విజయవాడ వచ్చిన ఆ పాప కుటుంబానికి జీవిత కాల విషాదం మిగిలింది. చిన్నారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. పాప డెడ్‌బాడీని మార్చురీ తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన నాగరాజు కుటుంబం శ్రీశైలం వెళ్తోంది. నాగరాజుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. దారి మధ్యలో విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. నగరంలోని మాచవరంలోని ఓ హోటల్‌లో బస చేసేందుకు దిగారు. అయితే రాత్రి సమయంలో అన్నాచెల్లెల్లు ఇద్దరూ.. గేమ్ ఆడుకుంటుండగానే.. దాక్కునేందుకు 4 ఏళ్ల చిన్నారి కిటికి డోర్ తెరుస్తూ.. ఆ ప్రయత్నంలోనే ప్రమాదవశాత్తు కిటికీ నుంచి జారి కింద పడిపోయి.. స్పాట్‌లోనే మృతి చెందింది. సమాచారం అందగానే హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్న మాచవరం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..