- Telugu News Photo Gallery Ap cm chandrababu naidu impressed with poor student's painting AP Latest News
AP News: అరుదైన చిరు జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu: తన అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడును నేరుగా కలిసి తీపి చిరు జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్ధిని లాస్యకు చంద్రబాబు అంటే అంతులేని అభిమానం.
Updated on: Oct 28, 2024 | 7:03 PM

తన అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడును నేరుగా కలిసి తీపి చిరు జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్ధిని లాస్యకు చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. గుర్తుగా ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. తన ఆర్థిక పరిస్థితి ఎందుకూ సహకరించకపోవడంతో తల్లడిల్లిపోయింది.

తన స్వహస్తాలతో గీసిన సీఎం చంద్రబాబు రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం సచివాలయానికి వచ్చింది. తాను గీసిన చిత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయడంతో చంద్రబాబు నాయుడు ఆనందంతో మురిసిపోయారు.

‘‘సంపద సృష్టించి పేదవారికి పంచి ఇచ్చే పెన్నిధికి ఒక పేద విద్యార్ధి ఇచ్చే చిరుజ్ఞాపిక’ అంటూ చిత్రంపై ఆ విద్యార్థిని రాసింది. ఇది చూసి ముగ్దుడైన చంద్రబాబు చిన్నారి లాస్యను అభినందించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు.

చంద్రబాబు నాయుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందజేయడంతో లాస్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
