Vijay Deverakonda: ఎకో వైజాగ్ కోసం విజయ్ దేవరకొండ.. ప్రచారంలో మరికొందరు పలువురు సినీ నటులు..
తాజాగా విజయ్ దేవరకొండ ఎకో వైజాగ్ పేరుతో చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ఐ లవ్ వైజాగ్ అంటూ వైజాగ్ గొప్పతనాన్ని చెప్తూ విశాఖ ను పరిశుభ్రంగా ఉంచుకోవడం పై చేసిన సూచనలు ప్రస్తుతం విశాఖ ఎఫ్ ఎం, థియోటర్లలో మోత మోగిస్తున్నాయి. ప్రజల అలవాట్లను మార్చడం, పచ్చదనాన్ని పెంపొందించడం,
సుందర విశాఖ లో నగర పౌరులకు కాలుష్య రహిత స్వచ్ఛమైన గాలి మరియు ప్లాస్టిక్ కాలుష్య నివారణకు ‘ఎకో- వైజాగ్’ పేరుతో సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది గ్రేటర్ వైజాగ్ మునిసిపల్ కార్పొరేషన్. దీని ప్రమోషన్ కోసం వివిధ రంగాల ప్రముఖుల చేత వీడియోలు చేయించి సినిమా థియేటర్ల తో పాటు విశాఖ లో పలు స్రీన్లు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ ఎకో వైజాగ్ పేరుతో చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ఐ లవ్ వైజాగ్ అంటూ వైజాగ్ గొప్పతనాన్ని చెప్తూ విశాఖ ను పరిశుభ్రంగా ఉంచుకోవడం పై చేసిన సూచనలు ప్రస్తుతం విశాఖ ఎఫ్ ఎం, థియోటర్లలో మోత మోగిస్తున్నాయి. ప్రజల అలవాట్లను మార్చడం, పచ్చదనాన్ని పెంపొందించడం, నీటి సంరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలు , సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కఠినమైన నిషేధం అనే భావన కలిగేలా ఉన్న ఈ సెలబ్రెటీల వీడియోలకు ఇప్పుడు పెద్ద డిమాండ్ ఏర్పడింది విశాఖలో.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న నగర పాల సంస్థ ఈ ఎకో వైజాగ్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. రామకృష్ణ బీచ్ రోడ్డులో ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలుచేసేందుకు టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగులతో సిటిజన్-సెంట్రిక్ క్యాంపెయిన్ను జెండా ఊపి ప్రారంభించారు నగర పాలక సంస్థ కమిషనర్ సాయికాంత్ వర్మ. గ్రేటర్ విశాఖ ను ‘నో ప్లాస్టిక్ జోన్’గా మార్చే ప్రయత్నంలో భాగంగా ఎకో వైజాగ్ క్యాంపెయిన్ ప్రారంభించడంతోపాటు ఎకో-క్లీన్, ఎకో-గ్రీన్, ఎకో- – బ్లూ, ఎకో-జీరో ప్లాస్టిక్ మరియు ఎకోను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది జీ వి ఎం సి. అదే సమయంలో విశాఖపట్నం ప్రజలు తమ పరిసరాల్లో చెత్త వేయవద్దని, తమ తమ ఆవరణలో చెట్లను కాపాడాలని కోరుతోంది జీ వి ఎం సి. అదే సమయంలో నీటిని ఆదా చేయాలని, పౌరులు స్నానాలు చేసేటప్పుడు షవర్లకు బదులుగా మగ్ లను ఉపయోగించాలని కూడా కోరుతోంది జీ వి ఎం సి
ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలను కూడా అన్వేషించింది జీ వి ఎం సి. ప్లాస్టిక్ బదులు ప్రత్యామ్నాయం కోసం గుడ్డ బ్యాగులు, ప్లాస్టిక్ ప్లేట్ల బదులు తయారు చేసేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన మహిళలకు జీవనోపాధిని కల్పిస్తున్న పర్యావరణ అనుకూల ప్లేట్లు మరియు గిన్నెలను త్వరలో వైజాగ్ లో హోటళ్ల వ్యాపారులు మరియు ఇతర వ్యాపారులు స్వీకరించే విధంగా ఆయా యాజమాన్యాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపింది జీవీఎంసీ. పెరుగుతున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సమస్యను ఎదుర్కోవడానికి జివిఎంసి వాటిని పెద్ద ఎత్తున నగర హోటళ్లకు అందుబాటులో ఉంచాలని యోచిస్తోంది.
స్వచ్ఛ వైజాగ్ సాధించడమే లక్ష్యం… వై వి సుబ్బా రెడ్డి
ఎకో వైజాగ్ కార్యక్రమం అద్భుతమైనదని పరిశుభ్ర విశాఖ ను నెలకొల్పడమే దాని లక్ష్యం అంటున్నారు టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ ప్రాంతీయ అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి. ఎకో వైజాగ్ పై టీవీ9 తో మాట్లాడుతూ … ఈ ప్రచారంలో భాగంగా, పర్యావరణ శుభ్రత, పచ్చదనం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ నిషేధం మరియు కాలుష్యం తగ్గించడం అనే ఐదు భాగాలపై దృష్టి పెదుతున్నామని, ప్రజల అలవాట్లను మార్చడం, పచ్చదనాన్ని పెంపొందించడం, నీటి సంరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కఠినమైన నిషేధం అనే భావన కల్పిస్తామన్నారు. జివిఎంసి ఇప్పటికే టాస్క్ కోసం స్క్వాడ్‌లను నియమించిందనీ, కాన్సెప్ట్ యొక్క ఖచ్చితమైన అమరిక కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌లను కూడా ఉపయోగిస్తుందన్నారు. 56 కిలోమీటర్ల బీచ్ తీర ప్రాంతంలోని నగర పరిమితుల్లో కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు పౌరుల మద్దతు మరియు భాగస్వామ్యం అవసరం అన్నారు సుబ్బా రెడ్డి.
ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం స్పెషల్ డ్రైవ్… నగర పాలక సంస్థ కమిషనర్ సాయి కాంత్ వర్మ.. ఎకో వైజాగ్ విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, అందుకే పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు సాయి కాంత్ వర్మ. అందులో భాగంగా పలువురు సెలబ్రిటీ ల చేత ఈ మెసేజ్ తో కూడిన వీడియోలు చేయించి అందరికీ రీచ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అలాగే జివిఎంసి బహిరంగ డంపింగ్ మరియు ఆపరిశుభ్రత వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి కూడా అవగాహన కల్పిస్తుందనీ, ఈ డ్రైవ్‌లో భాగంగా కార్పొరేషన్ పరిధిలో పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టనున్నాట్టు తెలిపారు. నీటి సంరక్షణలో భాగంగా బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ భారీ స్థాయిలో కొనసాగిస్తామన్నారు జివిఎంసి కమీషనర్ సాయికాంత్ వర్మ.
ఈ ప్రచారంలో భాగంగా 10 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను సిద్ధం చేస్తున్నామన్న జివిఎంసి కమిషనర్ ప్రతి టీమ్‌లో ఇద్దరు జివిఎంసి సిబ్బంది అవగాహన కల్పించేందుకు మరియు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడానికి, స్క్వాడ్ బృందాలకు ప్రత్యేక వాహనాలను అందించినట్లు తెలిపారు. విద్యా, ఇతర సంస్థలతో పాటు వాణిజ్య , వ్యాపార సంస్థలపై కూడా జివిఎంసి సిబ్బంది ప్రస్తుతం తనిఖీలు నిర్వహించి అవసరమైన చోట ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు జరిమానాలు కూడా విధిస్తున్నాయి. దీర్ఘకాలిక అమలు కోసం, ప్రజలు, వ్యాపారాలు , వాణిజ్య సంస్థల భాగస్వామ్యంతో పర్యావరణ నిధి కూడా ఏర్పాటు చేయబడుతుందంటూ వివరించారు సాయి కాంత్ వర్మ.
కాబట్టి విశాఖ పౌరులు అంతా ఈ మహా యజ్ఞంలో భాగస్వామ్యులు అవ్వాలని, అందమైన విశాఖ ను పర్యాటకులకు అందించేందుకు పోరులు అంతా ఈ ఉద్యమం లో పాల్గొనాలని టీవీ9 కూడా పిలుపునిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.