మేం చెబితే విన్నారా.. ఇప్పుడేమైంది.?

విపక్షానికి పరిమితమైన ఏపీ టీడీపీ నేతలు అడపాతడపా అధికార వైసీపీపై తమ అస్త్రాలు సంధిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ సర్కారుపై..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 2:58 pm, Tue, 1 September 20
మేం చెబితే విన్నారా.. ఇప్పుడేమైంది.?

విపక్షానికి పరిమితమైన ఏపీ టీడీపీ నేతలు అడపాతడపా అధికార వైసీపీపై తమ అస్త్రాలు సంధిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ సర్కారుపై రోజూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ ఫైర్ బ్రాండ్ వర్ల రామయ్య ట్విట్టర్ వేదిక చేసుకుని జగన్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘విశాఖ డాక్టర్ సుధాకర్ ను పిచ్చి వాడుగా చిత్రీకరణ జరుగుతోందని మేము ఎంత మొర పెట్టుకొన్నా వినలేదు. ఇప్పుడు, సిబిఐ అందులో కుట్ర దాగి ఉందని హైకోర్టు కు చెప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు లో జోక్యం చేసుకోకుండా అసలు ముద్దాయిలు అరెస్ట్ అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తూన్నాం’. అని జగన్ ప్రభుత్వాన్ని కోరారు. డాక్టర్లకు మాస్క్ లు అందుబాటులో లేవంటూ బహిరంగ విమర్శలు చేయడం.. ఆపై పోలీసుల చేతిలో నడిరోడ్డుపై దెబ్బలు తినడంతో దళితుడైన డాక్టర్ సుధాకర్ అంశం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.