రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై విచారణ వాయిదా

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు నిరవధికంగా వాయిదా వేసింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై విచారణ వాయిదా
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2020 | 3:13 PM

Rayalaseema lift irrigation: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు నిరవధికంగా వాయిదా వేసింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రక్రియను నిలిపివేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి, సామాజిక కార్యకర్త శ్రీనివాస్ వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై సుప్రీంకోర్టు, ఎన్‌జీటీలో విచారణ పెండింగ్‌లో ఉండగా తాము ఎలా జోక్యం చేసుకోవాలని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ అంశంపై తెలంగాణ హైకోర్టుకు విచారణ పరిధి ఉందని తెలంగాణ అదనపు ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించారు. అనుమతులు లేకుండా ఏపీ పనులు చేపడుతుందని రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు.

దీనిపై స్పందించిన సీజే ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వాన్ని, తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదని ప్రశ్నించింది. డీపీఆర్ సమర్పించి, టెండర్లకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వానికి ఎన్‌జీటీ అనుమతిని ఇచ్చిందని  పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాంటప్పుడు ఎన్‌జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదని హైకోర్టు ప్రశ్నించింది. విచారణ పరిదిపై ముందు ఎన్జీటీ తేల్చాలని హైకోర్టు తెలిపింది. ఇక పిటిషన్‌లోని అన్ని అంశాలు సుప్రీంకోర్టు ముందున్నాయని ఏపీ ఏజీ శ్రీరాం న్యాయస్థానానికి వివరించారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని శ్రీరాం హైకోర్టును కోరారు. దీంతో సుప్రీంకోర్టులో విచారణ పూర్తి అయ్యే వరకు ఈ పిటిషన్‌పై విచారణనను హైకోర్టు నిరవధికంగా వేసింది. సుప్రీంకోర్టులో తేలిన తర్వాత తమ దృష్టికి తీసుకు రావచ్చునని హైకోర్టు పిటిషనర్లకు సూచించింది.

Read More:

సత్యదేవ్‌కి క్రేజీ ఆఫర్‌.. తమిళ్‌లోకి ఎంట్రీ!

‘పుష్ప’కు హైలెట్‌గా రాక్‌స్టార్ మ్యూజిక్‌