‘పుష్ప’కు హైలెట్‌గా రాక్‌స్టార్ మ్యూజిక్‌

లెక్కల మాస్టర్ సుకుమార్ సినిమా అంటే ఎవరు ఉన్నా లేకున్నా.. సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ ఉండాల్సిందే.

'పుష్ప'కు హైలెట్‌గా రాక్‌స్టార్ మ్యూజిక్‌
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2020 | 1:29 PM

Pushpa Movie News: లెక్కల మాస్టర్ సుకుమార్ సినిమా అంటే ఎవరు ఉన్నా లేకున్నా.. సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ ఉండాల్సిందే. మ్యూజిక్ అంటే దేవీ, దేవీ అంటే మ్యూజిక్.. దేవీ తన సోల్‌ అని పలు సందర్భాల్లో వెల్లడించిన సుకుమార్‌ ఆ స్థానంలో మరొకరికి తీసుకునేందుకు పెద్దగా ఆసక్తిని చూపరు. అలాగే దేవీ సైతం సుకుమార్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్నిఇంతవరకు వమ్ముచేయలేదు.

అయితే పుష్ప విషయంలో సుకుమార్‌, దేవీని మార్చబోతున్నారని ఎన్నో పుకార్లు వచ్చాయి. రంగస్థలం తరువాత దేవీ మ్యూజిక్ స్టామినా తగ్గిందని, చాలా మంది దర్శకులు ఆయనను పక్కనపెట్టారని, ఆ లిస్ట్‌లో సుకుమార్ కూడా చేరిపోయాడంటూ వార్తలు వినిపించాయి. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ సినిమా ప్రారంభం రోజే దేవీని కన్ఫర్మ్ చేశారు సుకుమార్‌. అయినప్పటికీ ఆ తరువాత కూడా దేవీకి సంబంధించి పలు గాసిప్‌లు వినిపించాయి. కానీ వాటన్నింటిని పెద్దగా పట్టించుకోని సుకుమార్, దేవీ శ్రీ తమ తమ పనుల్లో మునిగిపోయారట.

ఈ క్రమంలో ఇంతవరకు తనపై వచ్చిన విమర్శలకు చెక్‌ పెట్టేలా ట్యూన్స్‌ని కూడా రెడీ చేశారట రాక్‌స్టార్‌. ఇక ఆ ట్యూన్స్‌ని సుకుమార్ ఫైనల్ చేశాడని సమాచారం. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. పుష్ప ట్యూన్స్‌ సుకుమార్‌కి బాగా నచ్చాయట. బన్నీ సైతం వాటిని విని, దేవీకి అభినందనలు చెప్పారని తెలుస్తోంది. త్వరలో ఈ ఆల్బమ్‌కి సంబంధించిన రికార్డింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.

కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక నటించనుంది. జగపతి బాబు విలన్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ముత్తం శెట్టి క్రియేషన్స్‌, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Read More:

ఆ రీమేక్‌పై ఆసక్తిగా ఉన్న మాటల మాంత్రికుడు!

త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న నటి విద్యుల్లేఖ