ఏపీలోని ఆ ప్రాంతంలో మద్యం సేవించి దొరికితే.. అంతే సంగతులు.. దబిడి.. దిబిడే.!
వారి తాగుడు అలవాటుకు అమాయక ప్రజలు బలి అవుతున్నారు. తాగి అతివేగంతో వెళ్తూ నియంత్రణ లేక అవతలివైపు వెళ్తున్నవారిని కూడా బలిగొన్న ఘటనలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారి కుటుంబాలలో నెలకొనే తీవ్ర విషాదాలను కూడా మనం అనేకం చూస్తున్నాం. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ..
విశాఖపట్నం, ఆగష్టు 30: మద్యం సేవించి వాహనాన్ని నడిపేవారు మానవబాంబుతో సమానం అట. తాగిన మత్తులో స్పృహ కోల్పోయి వాహనంపై కంట్రోల్ లేకపోవడంతో ప్రమాదాలు చేస్తున్నవారి పట్ల కోర్టులు చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాయి. వారి తాగుడు అలవాటుకు అమాయక ప్రజలు బలి అవుతున్నారు. తాగి అతివేగంతో వెళ్తూ నియంత్రణ లేక అవతలివైపు వెళ్తున్నవారిని కూడా బలిగొన్న ఘటనలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారి కుటుంబాలలో నెలకొనే తీవ్ర విషాదాలను కూడా మనం అనేకం చూస్తున్నాం. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇప్పించడం, అంతకుముందు జరిగిన భయంకరమైన ప్రమాదాల వీడియోలను చూపడం, వాటి ద్వారా వాళ్లలో మార్పు తెచ్చే ప్రయత్నాలు చేయడం లాంటి అనేకం చేశారు. అయినా మార్పు కనపడడం లేదు. నిరంతరం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎవరైనా దొరికితే.. పోలీసులు భారీగా ఫైన్ వేస్తారు. పదేపదే అలానే చేస్తూ దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. లేదంటే ఒక వారం పాటు జైలుకు పంపుతారు, కానీ ఆ శిక్షలు జనాలకు అలవాటైపోయాయి. ఆ శిక్షలకూ ఫలితం ఉండకపోవడంతో కొత్తరకం శిక్షలు వేస్తున్నారు న్యాయమూర్తులు. వాళ్లు తప్పు చేస్తున్నట్టు బయట ప్రపంచానికి తెలిసేలా చేయడం ద్వారా వాళ్లలో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో శిక్షలు విధిస్తున్నట్టు అర్దం చేసుకోవాల్సిన సందర్భాలు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి.
విశాఖలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కిన 60 మందికి సామాజిక సేవా శిక్ష..
వైజాగ్ బీచ్ రోడ్‌లో ఇటీవలకాలంలో నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అర్‌కే బీచ్ నుంచి భీమిలి వరకు తీరానికి ఆనుకుని ఉండే బీచ్ రోడ్‌లో ఈ తరహా డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా నగర శివారు ప్రాంతమైన భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇటీవల 60 మంది పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది గతంలో కూడా పట్టుబడిన వాళ్లుండటం గమనార్హం. వీరిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా భీమిలి కోర్టు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల ఫైన్ విధించింది. అంతటితో ఆగకుండా ఒకరోజు పాటు సామాజిక సేవ చేయాలంటూ ఆదేశించింది.
బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసే శిక్ష..
ఇటీవలకాలంలో తగరపువలస, భీమిలి, బీచ్ రోడ్లలో నగర కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించారు. ఆ సమయంలో పుల్‌గా తాగి వాహనాలు నడుపుతున్న 60 మందిని గుర్తించి కేసులు పెట్టారు. వారిని మంగళవారం భీమిలి ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రవేశపెట్టారు. వీళ్లను చూసిన న్యాయమూర్తి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ అంతటితో ఆగలేమని, భీమిలి ప్రభుత్వ డైట్ కళాశాల ప్రాంగణంలో పిచ్చిమొక్కలు తీయించి పరిశుభ్రత పనులు చేయించాలని ఆదేశించారు. న్యాయస్థానం ఆదేశాలతో శిక్షపడిన వారితో ఆ సామాజిక సేవ చేయించినట్లు భీమిలి పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రద్రేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..