Andhra Pradesh: పోలీసులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో సీఎం జగన్.. వైసీపీ పాలనపై కేంద్ర మంత్రి ఫైర్

వైసీపీ పాలనపై(YCP Ruling) రాష్ట్రస్థాయిలోని విపక్షాలే కాకుండా కేంద్ర ప్రభుత్వ నేతలూ ఫైర్ అవుతున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ అంశంపై ప్రభుత్వ తీరును కేంద్ర మంత్రి భారతి పవార్ తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా అనంతపురానికి...

Andhra Pradesh: పోలీసులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో సీఎం జగన్.. వైసీపీ పాలనపై కేంద్ర మంత్రి ఫైర్
Union Minister Shobha Karnd
Follow us

|

Updated on: Jun 16, 2022 | 10:20 AM

వైసీపీ పాలనపై(YCP Ruling) రాష్ట్రస్థాయిలోని విపక్షాలే కాకుండా కేంద్ర ప్రభుత్వ నేతలూ ఫైర్ అవుతున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ అంశంపై ప్రభుత్వ తీరును కేంద్ర మంత్రి భారతి పవార్ తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా అనంతపురానికి వచ్చిన మరో కేంద్ర మంత్రి శోభా సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అప్పులు, అవినీతి పెరిగాయని మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదన్న కేంద్ర మంత్రి.. రాష్ట్రానికి వస్తున్న రాబడి ఎక్కడికి వెళ్తోందని ప్రశ్నించారు. పోలీసులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్(CM Jagan) ప్రభుత్వం ఉందని ఆరోపించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క కళాశాల అయినా కట్టారా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక్క ఎంపీ సీటు గెలవకున్నా పలు సంక్షేమ పథకాలకు ప్రధాని మోదీ నిధులు ఇచ్చారని వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.

కాగా.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గతంలో కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పైర్ అయ్యారు. రెండు రోజుల పర్యటనకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి పవార్ విజయవాడ ఆస్పత్రిని పరిశీలించారు. ఆరోగ్య శ్రీ పథకంపై ప్రధాని మోదీ ఫొటో లేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా పీఎంజేఏవై నిధులతో నడుస్తున్న ఆరోగ్యశ్రీ పథకం లోగోపై దివంగత సీఎం వైఎస్‌, ప్రస్తుత సీఎం జగన్‌ల ఫోటోలు మాత్రమే ముద్రించి.. ప్రధాని ఫొటోను ముద్రించకపోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసిన ఆరోగ్యశ్రీ కార్డును చూపిస్తూ దానిపై ప్రధాని ఫొటో ఎందుకు లేదని నిలదీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..