Driving Licence: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్‌తో పన్లేదు.!
బండి బయటికి తీయాలంటే చాలు.. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, పొల్యుషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ లాంటి కీలక డాక్యుమెంట్స్ మన దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒకవేళ పొరపాటున వాటిని వెంట తీసుకెళ్లడం మర్చిపోయామా.. జేబులకు చిల్లే.
బండి బయటికి తీయాలంటే చాలు.. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, పొల్యుషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ లాంటి కీలక డాక్యుమెంట్స్ మన దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒకవేళ పొరపాటున వాటిని వెంట తీసుకెళ్లడం మర్చిపోయామా.. జేబులకు చిల్లే. అయితే ఇప్పుడు ఆ చింత లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ వాహనదారులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. బండి డాక్యుమెంట్స్ అన్నీ ఒకే చోట ఉండేలా ఓ యాప్ సిద్దం చేస్తున్నారు రవాణా శాఖ అధికారులు. ఆ యాప్‌లో మీ బండి నెంబర్, ఫోన్ నెంబర్‌ను నమోదు చేసుకుంటే చాలు.. మొత్తం వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అందులో దర్శనమిస్తాయి. మీరు కావాలంటే వాటిని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు.. యాప్ ద్వారా వాటిని చూపిస్తే సరిపోతుంది.అలాగే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన కొత్త నిబంధనలు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల రవాణా శాఖలు, లేదా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు కానున్నాయి. ఈ శిక్షణా కేంద్రాలు ఐదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటాయి. వీటిల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉత్తీర్ణులైనవారికి డ్రైవింగ్ టెస్టు లేకుండానే లైసెన్స్ జారీ చేయనున్నారు. కేవలం ఆయా ట్రైనింగ్ సెంటర్ల సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!