AP News: వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి.. ఆరా తీయగా
విశాఖపట్నంలో చోరీ చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. ద్వారకానగర్ జ్యువలరీ షాప్‌లో నకిలీ వెండితో బంగారం కాజేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాత మహిళా నేరస్థులను ద్వారకా క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నకిలీ వెండితో బంగారాన్ని కాజేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు ద్వారకా పోలీసులు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన ఇద్దరు మహిళలు బుధవారం ద్వారకానాగర్‌లోని ఓ జువెలరీ షాప్‌నకు వచ్చారు. తమ దగ్గర మూడు కిలోల వెండి ఉందని.. దానికి బదులుగా బంగారాన్ని కొనుగోలు చేస్తామన్నారు.
ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా
అయితే ఆ మహిళల కదలికలపై అనుమానమొచ్చి.. దుకాణం సిబ్బంది ఆ ఇద్దరు ఇచ్చిన వస్తువులను చెక్ చేయగా.. అది నకిలీ వెండిగా తేలింది. వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు జ్యువెలరీ షాప్ సిబ్బంది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. వారి వద్ద ఉన్న మూడు కిలోల నకిలీ వెండిని సీజ్ చేశారు. అలాగే 2023లోనే ఇదే తరహ ఘటన ఒకటి జరిగిందని పోలీసుల విచారణలో తేలింది.
ఇది చదవండి: పెళ్లి, ఆపై ఫస్ట్‌నైట్.. మూడో రోజే వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. అతడేం చేశాడంటే
ఇదే షాప్‌లో గతంలోనూ ఇలాగే ఏడు గ్రాముల బంగారాన్ని అపహరించినట్టు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కేసులో నిందితులు.. ఇప్పుడు పట్టుబడిన మహిళలు ఒకరేనని నిర్ధారించారు. వీరంతా ఒక ముఠాగా బీహార్ నుంచి విశాఖపట్నం వచ్చినట్టుగా గుర్తించి.. ఆ ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..