Andhra Politics: తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
ఎలక్షన్ ఏదైనా ఎలక్షనే అంటున్నాయి..ఏపీలో అధికార, విపక్ష పార్టీలు.. అది జడ్పీ చైర్మన్ ఎన్నికైనా.. ఉపసర్పంచ్ ఎన్నికైనా తగ్గేదేలేదంటూ పోటాపోటీగా క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి.. దీంతో నేడు కడపసహా పలు జిల్లాల్లో జరగనున్న లోకల్ బాడీ బై ఎలక్షన్స్..హీట్ పుటిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ 9 చోట్ల లోకల్‌బాడీ ఉప ఎన్నికలు జరగనున్నాయి..

ఎలక్షన్ ఏదైనా ఎలక్షనే అంటున్నాయి..ఏపీలో అధికార, విపక్ష పార్టీలు.. అది జడ్పీ చైర్మన్ ఎన్నికైనా.. ఉపసర్పంచ్ ఎన్నికైనా తగ్గేదేలేదంటూ పోటాపోటీగా క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి.. దీంతో నేడు కడపసహా పలు జిల్లాల్లో జరగనున్న లోకల్ బాడీ బై ఎలక్షన్స్..హీట్ పుటిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ 9 చోట్ల లోకల్‌బాడీ ఉప ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే క్యాంప్‌కి వెళ్లిన జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తిరిగొస్తున్నారు.. ముఖ్యంగా కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.. తిరుపతి రూరల్, కాకినాడ రూరల్, పల్నాడు జిల్లా అచ్చంపేట.. సత్యసాయి జిల్లా రామగిరిలో ఎంపీపీ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు అధికారులు.. ఇక కడప జిల్లా గోపవరం ఉపసర్పంచ్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
కడప జడ్పీ చైర్మన్ ఎన్నికపై స్టే విధించాలన్న టీడీపీ నేత పిటిషన్‌ను తోసిపుచ్చింది..ఏపీ హైకోర్టు. ఈ దశలో ఎన్నికపై జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో నేడు యథావిధిగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. అయితే ఇక్కడ వైసీపీ గెలుపు లాంఛనమే అయినా కూడా ముందు జాగ్రత్తగా తమ సభ్యులను క్యాంప్‌కు తరలించారు ఆ పార్టీ నేతలు. క్యాంప్ నుండి నిన్నరాత్రి కడప చేరుకున్న వైసీపీ జెడ్పీటీసీలు..నేడు నేరుగా జెడ్పీ కార్యాలయానికి వచ్చేలా ఏర్పాటు చేశారు. గత జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన ఆకే పాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో.. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక అనివార్యమయింది.
ఎంపీపీ ఎన్నిక సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా రామగిరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. గతంలో రామగిరి మండల పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 9, టీడీపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. అయితే ప్రస్తుత ఎంపీపీ మీనిగ నాగమ్మ చనిపోవడంతో..ఎన్నిక అనివార్యమైంది. అయితే పలువురు వైసీపీ సభ్యులు టీడీపీకి టచ్‌లోకి వెళ్లడంతో ఉద్రిక్తత నెలకుంది. ఇరుపార్టీల కార్యకర్తలు..రాడ్లు, కర్రలతో పరస్పరం దాడికి దిగడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ నేతల వాహనాల్లో మారణాయుధాలు గుర్తించిన పోలీసులు..వాటిని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఉప ఎన్నికల సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గాండ్లపెంట, రాయదుర్గం, కంబదూరు, కల్లుమరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. వైసీపీ సభ్యులపై అధికార పార్టీ ఆకర్షణ మంత్రం ప్రయోగిస్తుండడంతో..పలుచోట్ల ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది.
పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ ఎన్నిక వివాదంగా మారింది. ఎంపీపీ రజినిబాయ్ రాజీనామాతో ఇక్కడ ఎన్నిక అనివార్యమయింది. ఇక్కడ మొత్తం 17 మంది ఎంపీటీసీలు ఉండగా వారిలో ఒకరు మృతి చెందారు. మిగిలిన 16 మందిలో 9 మంది ఎంపీటీసీలు అదృశ్యమయ్యారు. దీంతో తమ నేతలను టీడీపీ కిడ్నాప్ చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు..వైసీపీ నేతలు. మరోవైపు టీడీపీకి చెందిన భూక్యా స్వర్ణమ్మను ఎంపీపీగా చేసేందుకు ప్రయత్నిస్తోంది..అధికార పార్టీ. దీంతో ఇక్కడి ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఎన్నికల సందర్భంగా ఉదిక్తత తలెత్తకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు.
కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నికలో కూడా క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. కాకినాడ రూరల్ మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలుగా..వైసీపీకి చెందిన ఏడుగురు ఎంపీటీసీలు తాజాగా జనసేనలో చేరిపోయారు. దీంతో మండల పరిషత్‌లో ఆ పార్టీ బలం పదికి చేరింది. దీంతో నేడు జరిగే ఎంపీపీ ఎన్నికపై ఆసక్తి నెలకుంది. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా జనసేనకు మద్దతిస్తున్న MPTCలను లంబసింగి క్యాంప్‌కు తరలించారు..జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ. లంబసింగి నుంచి ఈరోజు నేరుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకోనున్నారు..ఎంపీటీసీలు.
వైసీపీ, టీడీపీ నేతలు తగ్గేదేలేదంటుండడంతో.. కడప జిల్లాలోని గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆసక్తికరం మారింది. మొత్తం 20 వార్డులు ఉన్న గోపవరంలో వైసీపీకి 14 మంది, టీడీపీకి ఆరుగురు మెంబర్లు ఉన్నారు. అయితే ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా తమ నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తమ నేతలు చెయ్యిజారిపోకుండా 14 మంది వైసీపీ వార్డు మెంబర్లను క్యాంపుకు తరలించారు ఆ పార్టీ ఉపసర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..