Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2025 Session 2 Exam: జేఈఈ మెయిన్‌ 2025 పరీక్ష రాసేవారికి ‘డ్రెస్‌ కోడ్’ ఆంక్షలు..

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8, 9 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్టీయే ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులకు పలు ముఖ్య సూచనలు జారీ చేసింది..

JEE Main 2025 Session 2 Exam: జేఈఈ మెయిన్‌ 2025 పరీక్ష రాసేవారికి 'డ్రెస్‌ కోడ్' ఆంక్షలు..
JEE Main 2025 Session 2 Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 27, 2025 | 7:53 AM

హైదరాబాద్, మార్చి 27: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8, 9 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 8వ తేదీన పరీక్ష మొదటి షిఫ్టులో మాత్రమే జరగనుంది. అలాగే ఏప్రిల్‌ 9న పేపర్‌ 2ఏ (బీఆర్క్‌), పేపర్‌-2బి (బిప్లానింగ్‌, పేపర్‌ 2ఎ, బి (బీఆర్క్‌, బి ప్లానింగ్‌) పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరగనుంది. ఇక ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు ఇప్పటికే అందుబాటులో తీసుకురాగా.. తాజాగా జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్ కార్డులు కూడా ఎన్టీయే విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులకు పలు ముఖ్య సూచనలు జారీ చేసింది. విద్యార్ధుల డ్రెస్‌ కోడ్‌పై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రతి తప్పు ప్రశ్నకు నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. అందుకే ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండి జవాబులు గుర్తించాలి.

జేఈఈ అభ్యర్థులు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఇవే..

  • పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం సెషన్‌లో 8.30, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకే గేట్లు మూసి వేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరు. ఉదయం 7.30 నుంచి 8.30, మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల మధ్య పరీక్షా కేంద్రాల్లోకి అనుమాతిస్తారు.
  • ఎట్టిపరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
  • ఆధార్‌, పాస్‌పోర్ట్‌, రేషన్‌ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు (ఐడెంటిటీ) కార్డు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి.
  • రెండు పాస్‌పోర్టుసైజ్‌ ఫొటోలు, ట్రాన్స్‌పరెంట్‌ పెన్ను, అడ్మిట్‌ కార్డును మాత్రమే అనుమతిస్తారు. బీఆర్క్‌ పరీక్షకైతే పెన్సిల్, స్కేల్, రబ్బర్, జామెంట్రీ బాక్స్ తీసుకెళ్లవచ్చు.
  • పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు స్కార్ఫ్‌లు, మఫ్లర్‌లు, స్టోల్స్, షాల్స్, టోపీలు, రంగుల కళ్ళద్దాలు ధరించరాదు.
  • పాకెట్స్ లేకుండా వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి.
  • దుస్తులపై మెటాలిక్స్ అలంకారాలు ఉంటే అనుమతించరు. బూట్లు, మందమున్న చెప్పులు వేసుకోకూడదు.
  • లోహాలతో కూడిన వస్తువులు, ఆభరణాలు, నగలు లేకుండా చూసుకోవాలి. ఉంగరాలు, గాజులు వేసుకోకుంటే మంచిది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.