Theatres Mafia: సినిమా టికెట్‌ రేట్లు ఓకే మరి వాటి సంగతేంటి?.. టీవీ9 నిఘాలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..!

Theatres Mafia: సినిమా టికెట్‌ రేట్లు ఓకే మరి వాటి సంగతేంటి?.. టీవీ9 నిఘాలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..!
Theatres

Theatres Mafia: సినిమా అంటే.. వినోదం. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సినిమా అంటే విచారం అనేలా ఉంది. ఎందుకంటే సినిమా లగ్జరీగా మారుతోంది.

Shiva Prajapati

|

Dec 30, 2021 | 8:53 PM

Theatres Mafia: సినిమా అంటే.. వినోదం. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సినిమా అంటే విచారం అనేలా ఉంది. ఎందుకంటే సినిమా లగ్జరీగా మారుతోంది. మల్టీప్లెక్స్‌ల కారణంగా.. మధ్యతరగతికి అందని ద్రాక్షలా మారుతోంది. అందినా జేబుకు చిల్లే. సినిమాకు వెళ్తే పర్సు ఖాళీ అవుతోంది. మల్టిఫ్లెక్సుల్లో జరుగుతోన్న మల్టీలెవల్‌ దోపిడీపై టీవీ9 చేపట్టిన నిఘా ఆపరేషన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మారుమూలలో ఉండే ఆర్డినరీ థియేటర్ దగ్గర్నుంచి సిటీల్లో ఉండే మల్టిఫ్లెక్సుల వరకు క్యాంటీన్లలో జరుగుతోన్న దోపిడీని కళ్లకు కట్టినట్టు చూపించింది టీవీ9. మల్టీఫ్లెక్స్‌ మాఫియాకు ఎదురెళ్లిమరీ క్యాంటీన్ల మాఫియా ఆగడాలను బయటపెట్టింది. మల్టిఫ్లెక్సుల్లో క్యాంటీన్ల దోపిడీ ఎలాగుందో? ఫుడ్‌ ఐటెమ్స్‌ రేట్లు ఏ రేంజ్‌లో ఉన్నాయో? కొనలేని పరిస్థితి ఎందుకుందో అక్కడి పరిస్థితులను చూస్తే తేటతెల్లం అవుతుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మల్టిఫ్లెక్స్‌లో.. ఇంటర్వెల్‌లో కూతురికి ఏదైనా కొనిపిద్దామని వెళ్లిన తల్లికి మైండ్ బ్లాంక్ అయ్యింది. క్యాంటీన్‌లో ఉన్న రేట్లను చూసి దిమ్మతిరిగిపోయింది. పాప్ కార్న్, సమోసా, చాక్లెట్స్‌, బిస్కెట్స్‌, కూల్‌ డ్రింక్స్‌, టీ, కాఫీ రేట్లను చూశాక వారికి ఫీజులు ఎగిరిపోయాయి. చివరికి వాటర్ బాటిల్‌ కొందామనుకున్నా వంద రూపాయలు ఉండటంతో చుక్కలు కనిపించాయ్. ముట్టుకుంటేనే షాక్‌ కొట్టేలా ఉన్న ఆ ధరలను చూసి ఆ తల్లి వెనక్కి వచ్చేసింది. ఒక్క పాప్‌ కార్న్‌ ధరే మూడు నాలుగొందలు ఉండటంతో మారు మాట్లాడకుండా రిటర్న్ అయ్యింది.

ఈ మాఫియా మరో మాయ ఏంటంటే.. పిల్లలే టార్గెట్‌గా క్యాంటీన్లలో ఫుడ్‌ ఐటెమ్స్‌ పెడతారు. కొనకపోతే పిల్లలు మారాం చేస్తారు. దాన్ని క్యాష్ చేసుకుని దోపిడీకి స్కెచ్ వేశారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు ఇక్కడ కూడా అదే జరిగింది. క్యాంటీన్‌లో రేట్లు చూసి ఆ తల్లి వెనక్కి వెళ్లిపోతుంటే కూతురు మారాం చేసింది. కొనాల్సిందేనంటూ పట్టుబట్టింది. చివరికి చేసేదేమీ లేక కూతురికి పాప్ కార్న్‌, కూల్‌ డ్రింక్ కొనివ్వాల్సి వచ్చింది. ఇలా ప్రజల బలహీనతలనే వాళ్లకు ఆయుధం. పిల్లల మనస్తత్వమే వాళ్లకు పెట్టుబడి. రేటు ఎంతున్నా కొంటారన్న నమ్మకం. అందుకే, మల్టీఫ్లెక్సుల్లో క్యాంటీన్లు ఆడిందే ఆట – పాడిందే పాటగా సాగుతోంది దోపిడీ.

కూల్‌డ్రింక్ అడిగితే.. ట్యాప్ తిప్పి.. ఓ ప్లాస్టిక్ టిన్నులో పట్టి ఇస్తాడు. పాప్ కార్న్ కావాలంటే.. ఓ పొట్లంలో ఇస్తాడు. వాటి మీద ఎమ్మార్పీ ఉండదు. క్యాంటిన్‌లో ఎంత చెప్తే అంత చెల్లించాలి. లేదంటే.. నోరు మూసుకుని వెళ్లి సీట్లో కూర్చోవాలి. హైదరాబాద్‌ లాంటి మహానగరంలోనే ఈ రేట్లు, మారుమూల ఆర్డినరీ థియేటర్లలో మామూలు రేట్లే ఉంటాయని మోసపోకండి. అక్కడా అవే రేట్లు, అధిక ధరలే. అయితే, హైదరాబాద్‌తో పోలిస్తే కాస్త తక్కువ ఉంటాయ్ అంతే.

ఏ రకంగా చూసినా సినిమాకెళ్తే ఎవరి సరదా అయినా తీరిపోవడం ఖాయం. రెండున్నర గంటల్లో ఎంత వినోదం అందుతుందో తెలియదు కానీ, టెన్ మినిట్స్‌ ఇంటర్వెల్‌లో మాత్రం ప్రతి ఒక్కరి సరదా తీర్చేస్తున్నాయ్ క్యాంటీన్లు. నలుగురంటే నలుగురుండే ఓ చోటా ఫ్యామిలీ సినిమాకెళ్తే మినిమంలో మినిమం నాలుగు వేలు వదిలించుకుంటే గాని రిలాక్స్‌ కాలేరంటే దోపిడీ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోండి.

Also read:

Uttarakhand Assembly Election 2022: ఆ చేతులే రాష్ట్రాన్ని లూటీ చేశాయి.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా ప్రధాని మోడీ విమర్శలు..

Diabetes Care: చలికాలంలో షుగర్ అదుపులో ఉండాలంటే.. ఈ పదార్థాలను తీసుకోండి..

Gold Price: వినియోగదారులకు కొత్త ఏడాదిలో బంగారం ధరలు షాకివ్వనున్నాయా..? కారణం ఏమిటి..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu