- Telugu News Health Diabetes Care Tips: Include these foods in your diet to control diabetes in winter
Diabetes Care: చలికాలంలో షుగర్ అదుపులో ఉండాలంటే.. ఈ పదార్థాలను తీసుకోండి..
Diabetes Care Tips: చిన్నా పెద్ద తేడా లేకుండా డయాబెటిక్ సమస్య అందరినీ వేధిస్తోంది. మధుమేహాన్ని నియంత్రించడానికి బాధితులు మొదట తన జీవనశైలి, ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. మనం తీసుకునే ఆహారం, పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. కావున జాగ్రత్తగా ఉండాలి.
Updated on: Dec 30, 2021 | 8:12 PM

జామ - జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ పెరగడాన్ని నివారిస్తుంది. జామపండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌లు ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వెంటనే పెరిగే షుగర్ స్థాయిని నివారించడానికి వారి ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను చేర్చుకోవాలి.

నారింజ - అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లు 'డయాబెటిస్ సూపర్ ఫుడ్స్'. మీరు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మీ ఆహారంలో చేర్చుకోవాలి. నారింజలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మీరు దీన్ని సలాడ్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

క్యారెట్లు - పోషకాలు అధికంగా ఉండే క్యారెట్లు మీ మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. క్యారెట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల, డయాబెటిక్ రోగులు దీనిని తమ ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

దాల్చినచెక్క - ఈ మసాలా ఆరోగ్య ప్రయోజనకరమైన లక్షణాలతో నిండి ఉంది. రక్తంలో గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్ రెండింటి స్థాయిని నియంత్రించడంలో దాల్చినచెక్క సహాయపడుతుంది. ఇది మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం కోసం దాల్చినచెక్కను ఉపయోగించడండ మేలు. దీంతోపాటు దాల్చిన చెక్క నీటిని తాగడం మంచిది.

లవంగాలు - లవంగాలలో నైజెరిసిన్ మూలకం ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.





























