AP Elections: ఏపీ ఎన్నికల ఫలితాలపై టీవీ9 పోల్ అనాలసిస్….
ప్రస్తుత ఎన్నికల్లో ఎవరు గెలిచినా అది చరిత్రే అవుతుంది. వైసీపీ గెలిస్తే ఓ లెక్క.. కూటమి గెలిస్తే మరో లెక్క ఉంటుంది. వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమం ఆగుతుందని జగన్ విసృతంగా ప్రచారం చేశారు.. అటు కూటమి గెలిస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటుందని చంద్రబాబు చెబుతూ వచ్చారు.. ఇంతకీ ఏం జరుగబోతుంది.. నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఎన్నికల్లో ప్రభావితం చేసిన అంశాలు ఏంటి?
ఏపీలో ఎన్నికల ఫలితాలపై నరాల తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీల కంటే ప్రజల్లో దీనిపై చర్చ ఎక్కువగా జరుగుతోంది. అటు బెట్టింగ్ రాయుళ్లు, ఇటు సామాన్య ప్రజలు ఎవరికి వారు అంచనాలపై లెక్కలేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫలితాలపై రచ్చ అయితే బలంగా జరుగుతోంది. పార్టీలు ప్రమాణస్వీకారానికి ముహూర్తాలు కూడా పెట్టేశాయి.
స్వీప్ చేస్తామని సీఎం జగన్ గట్టిగా చెబుతున్నారు. ఫలితాలపై ప్రతిపక్ష నేత పెద్దగా స్పందించడం లేదు. పార్టీ నాయకులు అయితే ధీమాగానే ఉన్నారు. సీఎం జగన్ చెప్పినట్టు 2019 పలితాలను మించి సీట్లు వైసీపీ సాధించబోతుందా? టీడీపీ స్వీప్ చేస్తుందా?
ప్రస్తుత ఎన్నికల్లో ఎవరు గెలిచినా అది చరిత్రే అవుతుంది. వైసీపీ గెలిస్తే ఓ లెక్క.. కూటమి గెలిస్తే మరో లెక్క ఉంటుంది. వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమం ఆగుతుందని జగన్ విసృతంగా ప్రచారం చేశారు.. అటు కూటమి గెలిస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటుందని చంద్రబాబు చెబుతూ వచ్చారు.. ఇంతకీ ఏం జరుగబోతుంది.. నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఎన్నికల్లో ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? ఈ రోజు అనాలసిస్‌లో తెలుసుకుందాం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..