West Godavari: టీవీ9 ఇంపాక్ట్.. ఇసుక ర్యాంపుల నిలిపివేత.. లారీడ్రైవర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు
Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలవాసుల ఇక్కట్లకు టీవీ9 పరిష్కారం చూపింది. ఇసుకర్యాంపులతో పెరిగిన ట్రాఫిక్ కష్టాలకు అధికారులు చెక్‌పెట్టారు. ఇసుక ర్యాంపులను నాలుగురోజులపాటు మూసివేశారు.
Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలవాసుల ఇక్కట్లకు టీవీ9 పరిష్కారం చూపింది. ఇసుకర్యాంపులతో పెరిగిన ట్రాఫిక్ కష్టాలకు అధికారులు చెక్‌పెట్టారు. ఇసుక ర్యాంపులను నాలుగురోజులపాటు మూసివేశారు. కిలోమీటర్లమేర నిలిచిన ట్రాఫిక్‌ను దగ్గరుండి క్రమబద్ధీకరించిన కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్.. లారీడ్రైవర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొవ్వూరు మండలం ఔరంగాబాద్, వాడపల్లి దగ్గర ఇసుకర్యాంపులు సమీపగ్రామాలకు నరకప్రాయంగా మారాయి. ఇరుకైన ఏటిగట్టు రహదారిపై వందలాదిగా తిరుగుతున్న ఇసుకలారీలతో స్థానికుల అవస్థలు అంతాఇంతా కాదు. కిలోమీటర్లమేర నిలిచిన లారీలతో విద్యార్థులు స్కూలుకు కూడా వెళ్లలేని పరిస్థితి దాపురించింది. నిత్యం ఇవే కష్టాలంటూ వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. ఈనేపథ్యంలో ఇసుకర్యాంపులతో వాహనదారుల అవస్థలపై టీవీ9 కథనాలు కదిలించాయి. వరుస కథనాలతో దిగొచ్చిన అధికారులు.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టారు.
కాగా వాహనదారుల ట్రాఫిక్‌కష్టాలకు చెక్‌పెట్టేందుకు కృషిచేసిన టీవీ9ను స్థానికులు అభినందనలతో ముంచెత్తారు. ఇసుకర్యాంపులు నిర్వహణ నిలిచిపోవడంతో ట్రాఫిక్ రద్దీ తగ్గిందన్నారు. పిల్లలు సమయానికి పాఠశాలకు వెళ్తున్నారని చెబుతున్నారు. ఏటిగట్టురోడ్డుపై ఇసుకలారీలు అడ్డదిడ్డంగా నిలుపకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..