AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు తీపికబురు.. ఆగష్టు నెల టికెట్ల విడుదల ఆరోజే.. పూర్తి వివరాలు

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆగష్టు నెల కోటా ఆర్జితా సేవ టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

Tirumala: శ్రీవారి భక్తులకు తీపికబురు.. ఆగష్టు నెల టికెట్ల విడుదల ఆరోజే.. పూర్తి వివరాలు
Tirumala
Raju M P R
| Edited By: |

Updated on: May 16, 2025 | 8:25 PM

Share

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. ఆగష్టు నెల‌ కోటాను మే 19న విడుదల చేయనుంది. శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్‌లైన్‌ టికెట్లను భక్తులు పొందేలా నిర్ణయం తీసుకుంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగష్టు నెల కోటాను మే 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నునట్లు ప్రకటనలో పేర్కొంది. ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఈ టికెట్లు పొందినవారు మే 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని స్పష్టం చేసింది.

22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల..

శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల ప‌విత్రోత్స‌వాల‌ టికెట్లను మే 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఇక వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగష్టు నెల కోటాను మే 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఆగష్టు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారట. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగష్టు నెల ఆన్‌లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా..

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌ వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగష్టు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనున్నారు. ఆగష్టు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు.

ఇవి కూడా చదవండి

తిరుమల, తిరుపతిల‌లో ఆగష్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇక శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ, టీమ్ లీడర్స్(సీనియర్ సేవక్స్) సేవల జూలై నెల కోటాను మే 29న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరుతోంది.